Bandi Sanjay: మూసీ బాధితులపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరును కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పు బట్టారు. మూసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి తెరదీసిందని మండిపడ్డారు. మూసీ బాధితుల పక్షాన కోసం రేపు (25)న ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల కూల్చివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. మూసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి తెరదీసిందని మండిపడ్డారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ పార్టీ రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి ఏటీఎంలా వాడుకుందని ఆరోపించారు. రూ.లక్షన్నర కోట్లు అప్పు చేసి కాంగ్రెస్ కు ఏటీఎంలాగా మార్చాలనుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు. గత పాలకులు చేసిన దాదాపు రూ.6 లక్షల కోట్ల పైచిలుకు అప్పులకు 10 నెలల్లోనే రూ.60 వేల కోట్లు వడ్డీల రూపంలో చెల్లిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also: Gachibowli Fly Over: గచ్చిబౌలి ఫ్లై ఓవర్ క్లోజ్.. ఎప్పటి వరకు అంటే..
ఉద్యోగులకు జీతాలివ్వడం గగనమైందన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయలేక, ఎన్నికల హామీలు అమలు చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని తెలిపారు. మూసీ ప్రక్షాళన పేరుతో గత మూడు దశాబ్దాలుగా జైకా, జపాన్ నిధులు కూడా ఖర్చు చేసినా ఒనగూరిందేమీ లేదన్నారు. పాలకులు చేస్తున్న అప్పుల భారమంతా వివిధ రకాల పన్నుల రూపంలో ప్రజలపై భారం పడుతోందన్నారు. తెలంగాణలో 92 శాతం కుటుంబాలు అప్పుల్లో ఉన్నారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,29,599 అప్పు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల అప్పు చేసి ప్రజలపై మోయలేని భారం మోపడం దుర్మార్గం అన్నారు. ‘మూసీ ప్రక్షాళన’కు బీజేపీ వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ దోపిడీకి, పేదల ఇండ్ల కూల్చివేతకు వ్యతిరేకం అన్నారు. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ మూసీ బాధితుల పక్షాన రేపు ఇందిరాపార్క్ వద్ద బీజేపీ చేపట్టబోయే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. మూసీ బాధితులు, ప్రజలు పెద్దఎత్తున మహాధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఝప్తి చేస్తున్నా అన్నారు.
Amaran : అమరన్ ఓటీటీ పార్టనర్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే ?