Site icon NTV Telugu

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. వయనాడ్‌లో ప్రియాంక గాంధీ భారీ విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలతో పాటు వాయనాడ్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇందులో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ 4లక్షల మెజారిటీ దిశగా దూసుకుపోతున్నారు. దీనిపై ట్విటర్‌లో రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. కేరళలోని వయనాడ్ ఉప ఎన్నికల కౌంటింగ్ ఫస్ట్ ట్రెండ్‌లో మన అధినేత్రి ప్రియాంక గాంధీ భారీ ఆధిక్యతతో ఆధిక్యంలో ఉన్నారని అన్నారు. వయనాడ్ ప్రజలు ఈరోజు భారీ మెజారిటీ ఇచ్చి సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారని అన్నారు. ప్రియాంక గాంధీ భారీ విజయంతో పార్లమెంట్‌కు అరంగేట్రం చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వాయిదా పడింది. దీంతో కాంగ్రెస్ పార్టీ వయనాడ్ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీని అభ్యర్థిగా బరిలోకి దింపింది.
Sanjay Raut: ఇది ప్రజా తీర్పు కాదు.. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసి గెలుస్తున్నారు..

Exit mobile version