Site icon NTV Telugu

Hyderabad Rain: హైదరాబాద్‌లో కమ్ముకున్న మేఘాలు.. పలుచోట్ల వర్షం

Hyderabadrain

Hyderabadrain

అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచే భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో మేఘాలు కమ్ముకున్నాయి. అనేక చోట్ల వాన కురుస్తోంది. దీంతో ఉదయాన్నే డ్యూటీలకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇది కూడా చదవండి: Mohan Lal : మోహన్ లాల్ గొప్ప నిర్ణయం.. ఆ పిల్లలకోసం..

ఇదిలా ఉంటే తుఫాన్ కారణంగా ఈరోజు, రేపు భారీ వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: MI vs DC: హాఫ్ సెంచరీతో రాణించిన సూర్యకుమార్ యాదవ్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

సహజంగా రోహిణి కార్తె సమయంలో ఎండలు విపరీతంగా ఉంటాయి. ప్రజలు తీవ్ర వేడితో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమయంలో అకాల వర్షాలు కురవడంతో చేతికొచ్చిన పంట తడిచిపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఇంకోవైపు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించడంతో ప్రజలు ఆహ్లాదకరంగా గడుపుతున్నారు.

Exit mobile version