GHMC Office: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా.. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఆమ్రపాలి కాటతో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ పోలీసుల వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడాదైనా స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ జాతిచేసిన పోరాటం, రాజరిక పాలన నుంచి విముక్తి పొందిన రోజు సెప్టెంబర్ 17 అని తెలిపారు. తెలంగాణప్రజల స్వయం పాలనలో దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని, అభివృద్ధి సంక్షేమం పథకాలను అమలుచేస్తూ ఆర్థిక అభివృద్ధికి దోహదపడే విధంగా ప్రణాళికలు రచించి ప్రభుత్వ పథకాలనుప్రజలకు చేరువలో తీసుకుపోయిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఆదర్శంగానిలిచిందని చెప్పారు.
Read also: Bandlaguda Jagir: ఏకంగా రూ.1.87 కోట్లు పలికిన బండ్లగూడ గణేష్ లడ్డూ..!
ప్రజాపాలన కార్యక్రమంలో 6 గ్యారంటీల అమలుకు ప్రజలు అర్జి పెట్టుకొనేందుకు అవకాశంఇచ్చామని, ఆ దరఖాస్తులని పరిశీలన చేసి అర్హత గల కుటుంబాలకు ప్రభుత్వ ప్రయోజనంపొందుటకు యోగ్యత కల్పించారని తెలిపారు. ముఖ్యంగా 500 రూపాయలకే LPG వంట గ్యాస్ తో పాటుగా పేద ప్రజలకు విద్యుత్బిల్లుల చెల్లింపు భారం అవుతుందనే ఉద్దేశ్యంలో 200 యూనిట్ల వరకు ఉచితంగా అందించి, మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత రవాణా బస్సు సౌకర్యం కల్పించిందని తెలిపారు. మహిళలకు,విద్యార్థి లోకానికి,ఒక అన్నయ్యగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి ఒకే ఒక్కడని మేయర్ తెలిపారు. ప్రజాపాలన సందర్భంగా జిహెచ్ఎంసి వ్యాప్తంగా 28 డిసెంబర్ 2023 నుండి 6 జనవరి 2024వరకు నిర్వహించడం జరిగిందని, ఈ సందర్భంగా ఒక వార్డులో 4 కౌంటర్లు ఏర్పాటు చేసిఅందులో మహిళలకు వికలాంగులకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి, ప్రజలకు లబ్ధి చేకూరేపథకాల అమలు కోసం దరఖాస్తు స్వీకరించడం జరిగిందని తెలిపారు.
Read also: Big Breaking: ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆందోళన..
150వార్డులలో 600 కౌంటర్లు ఏర్పాటు చేసి, 10 వేల మంది సిబ్బందితో పాటుగా వాలంటీర్లను వినియోగించడం జరిగిందని, కౌంటర్వద్దకు వచ్చిన ప్రతి దరఖాస్తును తీసుకొని, సర్కిల్ వారీగా కంప్యూటరైస్ చేయడమైనదని తెలిపారు. ప్రజాపాలనలో26,48,521 లక్షల కుటుంబల నుండి 24,74,325 దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని, అందులో అభయ హస్తం 19,01,256 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, స్వీకరించినప్రజాపాలన దరఖాస్తులో సవరణ కోసం 30 సర్కిల్లలోని వార్డు కార్యాలయాల్లో సేవకేంద్రాలను ఏర్పాటు చేసి అర్హులైన వారికి అభయ హస్తం ద్వారా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజా పాలన కోసంప్రతి జిల్లాలో ప్రభుత్వ సెలవు మినహా ప్రతి సోమవారం జిహెచ్ఎంసి లో కూడా ప్రజావాణినిర్వహించి అధికారుల భాధ్యతతో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజా ప్రభుత్వానికి ప్రజల సహకారం ఎప్పటికీ ఉండాలని మేయర్ కోరారు.
Kishan Reddy: నేడు నియంతృత్వ నిజాం నుంచి తెలంగాణకు విమోచన లభించిన రోజు..