Ponnam Prabhakar: కలకత్తాలో వైద్యురాలు పై జరిగిన అత్యాచారం ,హత్య నన్ను తీవ్రంగా కలచివేసిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సభ్యసమాజం తలదించుకునే ఘటన.. వారికి దేశమంతా అండగా ఉందన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు. వారి కుటుంబానికి న్యాయం జరగాలని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి వారిని కఠినంగా శిక్షించాలన్నారు. దేశ వ్యాప్తంగా డాక్టర్ల నిరసనకు సంఘీభావం తెలుపుతున్న. వారి నిరసనలు సభభే అని మద్దతు పలికారు. నిన్న ప్రైవేట్ హాస్పటల్స్ లో వైద్యులు ఓపీ,అత్యవసర సేవలు బంద్ చేసి నిరసనలు తెలపడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. వైద్యులు డ్యూటీ లో ఉండి నిరసనలు తెలపాల్సింది గా నా యొక్క విజ్ఞప్తి అని అన్నారు. వైద్యుల పై దాడి చేస్తే తీవ్ర చర్యలు ఉంటాయని గతంలో కాంగ్రెస్ పార్టీ చట్టం చేసింది.. వారికి మద్దతుగా ఉంటా అన్నారు.
Read also: Change Toothbrush: దంత సమస్యలను నివారించడానికి ఎన్ని రోజులకు ఒకసారి టూత్ బ్రష్ మార్చుకోవాలి.?
కోల్‌కతా వైద్యురాలి ఘటన యావత్ దేశాన్ని షాక్‌కి గురిచేసింది. బాధితురాలిపై జరిగిన దాడిని నిరసిస్తూ న్యాయం కోసం మెడికోలు, మహిళలు, సాధారణ ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలు నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో అత్యంత దారుణంగా అత్యాచారం, హత్యకు గురైంది. ఈ ఘటనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. మరోవైపు, ఈ కేసును సరిగా దర్యాప్తు చేయని కారణంగా కలకత్తా హైకోర్టు కేసుని సీబీఐకి బదిలీ చేసింది. ప్రభుత్వం వైఫల్యం, ఆస్పత్రి నిర్లక్ష్యం, పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Change Toothbrush: దంత సమస్యలను నివారించడానికి ఎన్ని రోజులకు ఒకసారి టూత్ బ్రష్ మార్చుకోవాలి.?