Ponnam Prabhakar: రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు యాజమాన్యాలు తాళాలు వేసిన విషయం తెలిసిందే. సుమారు 9 నెలలుగా ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ భవనాల యజమానులు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, హాస్టళ్లకు తాళాలు వేశారు. దీనిపై రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. గురుకుల పాఠశాల గేట్లకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ కేసులు వేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికీ 70 శాతం గురుకులాలు అద్దె భవనాల్లోనే వున్నాయని తెలిపారు. గత కొద్ది సంవత్సరాలుగా రాని బకాయిలు అడగలేక.. నేడో, రేపో నిధులు విడుదల చేసే సమయంలో ఇలా గురుకులాలకు తాళం వేయడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. ఎవరి మాటలు పట్టుకొని కవ్వింపు చర్యలకు పాల్పడవద్దు అని సూచించారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించే ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాత బకాయిలు ఇప్పించే బాధ్యత మాదని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
Read also: Telangana: గురుకుల పాఠశాలలకు తాళాలు.. బయటే టీచర్లు, విద్యార్దుల నిరీక్షణ..
మరి దీనిపై గురుకులాలకోసం అద్దెకు ఇచ్చిన యాజమాన్యం ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠంగానే ఉంది. ఇప్పటి వరకు గురుకులాలకు తాళం వేసింది వేసినట్లే ఉంది. మరి మంత్రి ఆదేశాలతో జిల్లా కలెక్టర్లు ఎంట్రీ ఇచ్చి గురుకులాలకు వేసిన తాళాలు తీసివేస్తారా? అద్దెకు ఇచ్చిన యాజమాన్యాలతో కలెక్టర్లు సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితి ఏవిధంగా పరిశీలించనున్నారో మరి. అయితే దసరా సెలవుల అనంతరం గురుకులాలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు అద్దె భవనాల యాజమాన్యం తాళం వేయడంతో బయటే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ప్రభుత్వం గురుకులాల భవనాల అద్దెలను ఎప్పుడు చెల్లిస్తుందనే దానిపై ఇంకా క్లారీటీ లేదు. దీనిపై అద్దెకు ఇచ్చిన యాజమాన్యం మాత్రం స్పందించకపోవడం గమనార్హం.
MP Dharmapuri Arvind: మంత్రి కోమటిరెడ్డి నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు..