NTV Telugu Site icon

Ponnam Prabhakar: ప్రతి పక్షాల ఉచ్చులో నిరుద్యోగులు పడొద్దు..

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar: ప్రతి పక్షాల ఉచ్చులో నిరుద్యోగులు పడొద్దని, చదువుకోవాల్సిన సమయాన్ని వృధా చేసుకోవొద్దని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్ చేశారు. జాబ్ క్యాలెండర్ గురించి మేధావుల అభిప్రాయం తీసుకొని విడుదల చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఉంటుందన్నారు. కిషన్ రెడ్డి హైదరాబాద్ ఇమేజ్ ని చెడగొట్టాలని చుస్తే ఊరుకోమన్నారు. హైదరాబాద్ లో భూ కబ్జాలకు, అరాచకాలకు కారణం మీరు కాదా? అన్నారు. జీహెచ్ఎంసి ఎన్నికల్లో రాజకీయ ఆటకోసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ,హైదరాబాద్ ని విమర్షిస్తుండని మండిపడ్డారు.

Read also: Kanguva Director Shiva : మా మంచి తెలుగు వారు…తమిళ్ వాళ్లు అలా కాదు…

కేంద్ర మంత్రిగా ఉండి ఐదు ఏండ్లలో హైదరాబాద్ కు ఏమి నిధులు తెచ్చారో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. పది ఏండ్లలో కేంద్రలో బీజేపీ అధికారంలో ఉండి మీరు హైదరాబాద్ కు ఏమి చేశారని ప్రశ్నించారు. ప్రత్యేకంగా ఏమైనా నిధులు తెచ్చారా చెప్పాలన్నారు. కేంద్ర మంత్రిగా హైదరాబాద్ అభివృద్ధికి సహకరించండి అన్నారు. త్వరలో క్షేత్ర స్థాయిలో ముఖ్యమంత్రి పర్యటన చేస్తారన్నారు. మీకు శ్రద్ద ఉంటే ప్రత్యక నిధులు తీసుకరండి .. విమర్శలు చేయకండి అని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ లు మిత్ర పక్షంగా ఉండి హైదరాబాద్ ను ఆగం చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అభివృద్ధి పై మా మంత్రి వర్గంతో చర్చకు పిలిచాము.. రాలేదన్నారు. హైదరాబాద్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
Motkupalli Narasimhulu: కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది.. మోత్కుపల్లి నరసింహులు హాట్ కామెంట్స్..