Police Raided Pubs: హైదరాబాద్‌లోని పబ్‌లపై పోలీసులు దాడులు చేశారు. శనివారం రాత్రి 25 పబ్బుల్లో ఎక్సైజ్, నార్కోటిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పబ్‌లోని వారికి డ్రగ్స్ డిటెక్టివ్ కిట్‌లతో నమూనాలు సేకరించారు. మొత్తం 50 మందికి పైగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని సమాచారం. వారిని విచారించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పబ్ లపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Read also: Scheduled Castes Reservations: ప్రభుత్వ ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కులాలకు 20% రిజర్వేషన్..
ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో డ్రగ్స్ సంస్కృతి పెరుగుతోంది. ప్రధానంగా పబ్బుల్లో యువత, యువకులు డ్రగ్స్ సేవిస్తున్నారు. ఇటీవల పోలీసులు జరిపిన తనిఖీల్లో సినీ, రాజకీయ ప్రముఖులు కూడా డ్రగ్స్ వాడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పలువురిని అరెస్ట్ చేసినా హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా ఆగడం లేదు. నగరంలో మాత్రం విచ్చలవిడిగా డగ్స్ లభ్యమవుతోంది. దీంతో యువత డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు. డ్రగ్స్ తాగి అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం డ్రగ్స్, గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు హైదరాబాద్ పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో 25 పబ్‌లను తనిఖీ చేశారు. మరిన్ని దాడులకు సిద్ధమవుతున్నారు.
SPA Center: స్పా ముసుగులో వ్యభిచారం.. 7 మంది అరెస్ట్..