NTV Telugu Site icon

Hyderabad Metro: నిలబడేందుకు చోటులేదు.. మెట్రోలో కోచ్ లు పెంచండి..

Hyderabad Metro

Hyderabad Metro

Hyderabad Metro: మెట్రో రైల్లో రద్దీకి అనుగుణంగా కోచ్ లను పెంచాలని సీపీఎం ఆధ్వర్యంలో మెట్రో భవన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. రోజు 5 లక్షలకు పైగా ప్రయాణికులు మెట్రో లో ప్రయాణం చేస్తున్నారని, నిలబడేందుకు కూడా చోటు లేకుండా మెట్రోలో ప్రయనించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రద్దీ పెరిగితే 3 కోచ్ ల నుండి 6 కోచ్ లకు పెంచుతామని L&T అధికారులు గతంలో చెప్పారని గుర్తుచేశారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా కోచ్ లు పెంచాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు టాయిలెట్స్, పార్కింగ్ కు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి చొరవ తీసుకొని పార్కింగ్ ఫీజులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకుల నిరసనలతో మెట్రో స్టేషన్ వద్ద భారీగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.

Read also: Ponnam Prabhakar: కూల్సుంపుర పాఠశాలను సందర్శించిన పొన్నం ప్రభాకర్‌..

మెట్రో స్టేషన్‌ వద్ద ఉచిత పార్కింగ్‌ ఉన్నట్టుండి ఎత్తివేయడం వివాదానికి దారి తీస్తుంది. నాగోల్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ఉన్న పార్కింగ్ స్థలంలో నిర్వాహకులు పెయిడ్ పార్కింగ్ అన్ని చెప్పడంతో వివాదానికి దారి తీసింది. చాలా సేపు వాహనదారులకు, నిర్వాహకులకు మధ్య ఘర్షణ చెలరేగింది. చాలా ఏళ్లుగా మెట్రో ప్రయాణికులు తమ వాహనాలను అక్కడ ఫ్రీగా పార్కింగ్ చేసుకుంటుండగా.. గురువారం నుంచి ధరలు నిర్ణయించగా.. వాహనదారుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. పైగా పార్కింగ్ చేసుకోవడానికి ‘పార్క్‌ హైదరాబాద్‌’ అనే యాప్‌ నుంచి చేయాలని కండిషన్ పెట్టారు. ఆ యాప్‌ గూగుల్‌ నుంచి డౌన్‌లోడ్‌ కావడం లేదని వాహనదారులు చెబుతున్నారు. అసలే ఆఫీసులకు వెళ్లే తొందరలో ఉన్న వారిని ఈ పార్కింగ్ సమస్య తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. నగదు చెల్లించి పార్కింగ్ చేసేందుకు అనుమతించకపోవడంతో చాలా మంది వాహనదారులు వారిపై తిరగబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Rain Alert: హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్.. ఏడు జిల్లాల్లో భారీ వర్ష సూచన..

Show comments