Hyderabad Metro: నిలబడేందుకు చోటులేదు.. మెట్రోలో కోచ్ లు పెంచండి..
- రోజు 5 లక్షలకు పైగా ప్రయాణికులు మెట్రో లో ప్రయాణం..
- నిలబడేందుకు కూడా చోటు లేకుండా మెట్రోలో ప్రయనించాల్సిన పరిస్థితి..
- 3 కోచ్ ల నుండి 6 కోచ్ లకు పెంచాలని సీపీఎం నాయకుల ధర్నా..
- పార్కింగ్ ఫీజులు రద్దు చేయాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Metro: మెట్రో రైల్లో రద్దీకి అనుగుణంగా కోచ్ లను పెంచాలని సీపీఎం ఆధ్వర్యంలో మెట్రో భవన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. రోజు 5 లక్షలకు పైగా ప్రయాణికులు మెట్రో లో ప్రయాణం చేస్తున్నారని, నిలబడేందుకు కూడా చోటు లేకుండా మెట్రోలో ప్రయనించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రద్దీ పెరిగితే 3 కోచ్ ల నుండి 6 కోచ్ లకు పెంచుతామని L&T అధికారులు గతంలో చెప్పారని గుర్తుచేశారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా కోచ్ లు పెంచాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు టాయిలెట్స్, పార్కింగ్ కు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి చొరవ తీసుకొని పార్కింగ్ ఫీజులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకుల నిరసనలతో మెట్రో స్టేషన్ వద్ద భారీగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
Read also: Ponnam Prabhakar: కూల్సుంపుర పాఠశాలను సందర్శించిన పొన్నం ప్రభాకర్..
Also Read
- Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
మెట్రో స్టేషన్ వద్ద ఉచిత పార్కింగ్ ఉన్నట్టుండి ఎత్తివేయడం వివాదానికి దారి తీస్తుంది. నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న పార్కింగ్ స్థలంలో నిర్వాహకులు పెయిడ్ పార్కింగ్ అన్ని చెప్పడంతో వివాదానికి దారి తీసింది. చాలా సేపు వాహనదారులకు, నిర్వాహకులకు మధ్య ఘర్షణ చెలరేగింది. చాలా ఏళ్లుగా మెట్రో ప్రయాణికులు తమ వాహనాలను అక్కడ ఫ్రీగా పార్కింగ్ చేసుకుంటుండగా.. గురువారం నుంచి ధరలు నిర్ణయించగా.. వాహనదారుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. పైగా పార్కింగ్ చేసుకోవడానికి ‘పార్క్ హైదరాబాద్’ అనే యాప్ నుంచి చేయాలని కండిషన్ పెట్టారు. ఆ యాప్ గూగుల్ నుంచి డౌన్‌లోడ్ కావడం లేదని వాహనదారులు చెబుతున్నారు. అసలే ఆఫీసులకు వెళ్లే తొందరలో ఉన్న వారిని ఈ పార్కింగ్ సమస్య తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. నగదు చెల్లించి పార్కింగ్ చేసేందుకు అనుమతించకపోవడంతో చాలా మంది వాహనదారులు వారిపై తిరగబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Rain Alert: హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్.. ఏడు జిల్లాల్లో భారీ వర్ష సూచన..
తాజావార్తలు
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!