Site icon NTV Telugu

Revanth Reddy Photo: ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటో పెట్టండి.. అధికారులకు సర్కార్‌ ఆదేశం

Cm Revanth Reddy

Cm Revanth Reddy

Revanth Reddy Photo: ప్రభుత్వం ఫైనల్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించాలని సర్కార్ ఆదేశించింది. అక్టోబర్ 7వ తేదీ లోపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటో ఏర్పాటు చేయాలని తెలిపింది. జిల్లా కలెక్టర్లు, డివిజన్, మండల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో నమూనాను కూడా విడుదల చేస్తూ.. ప్రభుత్వం కార్యాలయాల్లో సీఎం పెట్టాలని తెలిపింది. ఇప్పటికే కొందరు నాయకులు ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేదనే వాదనపై ప్రభుత్వం స్పందించింది. దీంతో వచ్చే నెల 7వ తేదీ వరకు గడువు ఇస్తూ ఆదేశించింది. అన్ని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 7వ తేదీ వరకు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను అన్ని ప్రభుత్వం కార్యాలయాల్లో ఉండాలని తెలిపింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తి అయిన ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను అన్ని ప్రభుత్వ కార్యాయాల్లో సీఎం ఫోటోను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ.. అక్టోబర్ 7వరకు గడువు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, డివిజన్, మండల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Exit mobile version