NTV Telugu Site icon

Tummala Nageswara Rao: రైతులను ఆదుకోండి.. తుమ్మలకు వినతిపత్రం

Tummala Nageswara Rao

Tummala Nageswara Rao

Tummala Nageswara Rao: రైతు రుణమాఫీ, రైతు భరోసాకు సంబంధించి రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు తెలంగాణ రైతు పరి రక్షణ సమితి అధ్యక్షుడు శ్రీహరి వినతిపత్రం అందజేశారు. రైతుల పరిస్థితి రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుంది. రైతులు అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసాకు సంబంధించి రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలన్నారు. రైతులకు సంబంధించి ఐదు తీర్మానాలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. రైతు పండించిన పొకు ఇటువంటి ధర కల్పించాలన్నారు.

Read also: Gold Price Today: స్థిరంగా పసిడి ధరలు.. హైదరాబాద్‎లో తులం ఎంతంటే?

ధరలు నిర్ణయించడంలో కేంద్రం విఫలమైంది. ప్రతి పంట పైన 1000 నుండి 4000 తగ్గించి కేంద్ర ప్రభుత్వం ధర నిర్ణయిస్తుందని తెలిపారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలన్నారు. పంటలకు ప్రకటించిన ఎంఎస్పికి చట్టబద్ధత కల్పించాలని కోరారు. రైతు పండించిన పంటలకు పంటల బీమా పథకం అమలు చేయాలన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని తెలిపారు. వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న రైతులకు పంట రుణాన్ని మూడు లక్షల వరకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
Odisha : జగన్నాథ ఆలయంలోని రత్నాల దుకాణం ఎప్పుడు ఓపెన్ అవుతుంది… దాని వెనుక రహస్యం ఏమిటి?