BV Pattabhiram: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్ తుదిశ్వాస విడిచారు. ఆయనకు గుండెపోటు రావడంతో కన్నుమూశారు. మానసిక వైద్యుడిగానూ పట్టాభిరామ్ ప్రసిద్ధి చెందారు. ఆయనకు భార్య జయ, కుమారుడు ప్రశాంత్ ఉన్నారు. అయితే, బీవీ పట్టాభిరామ్ భార్య కూడా వ్యక్తిత్వ వికాస నిపుణురాలిగా పేరుంది. ఇక, ఖైరతాబాద్‌లోని స్వగృహంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. బుధవారం నాడు ఉదయం 9 గంటల నుంచి అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. అలాగే, మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
Read Also: Minister Nara Lokesh: పుట్టకతోనే లివర్ సమస్య.. 6 నెలల చిన్నారి ప్రాణాలు నిలిపిన మంత్రి లోకేష్..
అయితే, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ‘రావ్ సాహెబ్’ భావరాజు సత్యనారాయణ సంతానంలో బీవీ పట్టాభిరామ్ ఒకరు. కాకినాడలో ఉన్నత విద్యార్థిగా ఉన్న సమయంలో ఎంబేర్ రావు అనే ఇంద్రజాల నిపుణుడి నుంచి మాయాజాల విద్యను నేర్చుకున్నారు. ఆపై హైదరాబాద్‌లోని ఆహార సంస్థలో ఉద్యోగం చేస్తూనే ఆ కళను అభ్యసించారు. 1970ల నాటికి రెండుమూడు గంటల పాటు ప్రేక్షకులను కట్టిపడేసే స్థాయిలో స్వతంత్రంగా ఇంద్రజాల ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగారు.
