Site icon NTV Telugu

Dr MP Laxman: ఆ ఇద్దరి వల్లే దేశం రెండు ముక్కలు అయ్యింది..

Dr Lakshmi

Dr Lakshmi

Dr MP Laxman: ఆ ఇద్దరి వల్లే దేశం రెండు ముక్కలు అయ్యిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పింగళి వెంకయ్య విగ్రహం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ట్యాంక్ బండ్ పింగళి వెంకయ్య విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. హర్ ఘర్ తిరంగా ర్యాలీలో ఎంపీ లక్ష్మణ్, పార్టీ శ్రేణులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఆగస్టు 15న దేశo రెండు ముక్కలు కావడం దురదృష్టకరం అన్నారు. ప్రధాని పోస్ట్ కోసం నెహ్రూ, జిన్నా పోటీ పడ్డారని తెలిపారు.

Read also: CM Revanth Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా లెక్కలు తేలాల్సి ఉంది..

ఆ ఇద్దరి వల్లే దేశం రెండు ముక్కలు అయ్యిందన్నారు. 70 ఏళ్ళలో జరగని అభివృద్ధి పదేళ్ల మోడీ పాలనలో జరిగిందన్నారు. అతి పెద్ద ఆర్థిక దేశంగా భారత్ ఎదిగిందని తెలిపారు. మోడీ నేతృత్వంలో దేశం పటిష్టంగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. మోడీ నేతృత్వంలో దేశ అభివృద్ధిని కొన్ని విచ్ఛిన్నకర శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని తెలిపారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసిన శక్తులే నేడు మళ్ళీ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ దేశాలుగా విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ సవాళ్లను ఎదుర్కునేoదుకు దేశ యువత సిద్ధం కావాలన్నారు.
Rythu Bharosa: గుడ్‌ న్యూస్‌ చెప్పిన సీఎం రేవంత్‌ రెడ్డి.. త్వరలో రైతు భరోసా..

Exit mobile version