Moosarambagh Bridge: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసారాంబాగ్ బ్రిడ్జ్ పరిస్థితి గందరగోళంగా మారింది. మూసీ నది ఉగ్రరూపంలో ప్రవహిస్తూ, బ్రిడ్జీపై సుమారు 10 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. మూసారాంబాగ్ బ్రిడ్జీ, దోబీ ఘాట్, జలమయమైన పెట్రోల్ బంక్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఈ భారీ వరద ఉధృతిని చూసి స్థానికులు భయపడుతున్నారు.
Read Also: Balakrishna: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న బాలయ్య.. ఏం మాట్లాడారంటే..?
ఇక, మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర పరిస్థితిని చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సమీక్షించారు. తమ సిబ్బందికి అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండమని ఆదేశించారు. నిన్న సాయంత్రం నుంచే మూసీ పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి, లోతట్టు ప్రాంతాల వారిని రిహాబిలిటేటెడ్ సెంటర్లకు తరలించాలని పేర్కొన్నారు. ఆరు రిహాబిలిటేటెడ్ సెంటర్లలో 1,083 మందికి ఆ శిక్షణలు, భోజన సదుపాయాలు, తాత్కాలిక నివాస ఏర్పాట్లు కల్పించబడ్డాయి. చాదర్ ఘాట్ వద్ద అక్కడే ఉండిపోయిన కొందరిని హైడ్రా, DRF సహకారంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Read Also: Story Board: హైడ్రాను తిట్టినోళ్లే పొగడ్తలు కురిపిస్తున్నారు.. బతుకమ్మ కుంటకు పునర్జీవం..
అయితే, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ కూడా ముసారాంబాగ్ బ్రిడ్జీ దగ్గర పరిస్థితిని పరిశీలించారు. వరద ప్రవాహాన్ని తట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న అధికారులతో సమన్వయం చేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వికారాబాద్ ప్రాంతంలో కూడా కురుస్తున్న భారీ వర్షాలతో వరద ఉధృతి కొనసాగుతోంది. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే, మిగతా సర్కిల్‌ల నుంచి సిబ్బందిని పిలిపించి సహాయక చర్యలు కొనసాగించాలని అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఆదేశించారు.
