Site icon NTV Telugu

MLC Kavitha: రిజర్వేషన్లు తేల్చకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు..

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: బంజారా హిల్స్ లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ సంఘాల సమావేశం ముగిసింది. ముందుగా.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు మరణం పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు బీసీ సంఘం నేతలు, ఎమ్మెల్సీ కవిత. అనంతరం కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థలలో బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ సమావేశంలో చర్చించారు. సమావేశం అనంతరం సంఘాల నాయకులు, ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది.

Read also: Telangana Rains: తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..

బీసీలకు రిజర్వేషన్లు ఫైనల్ చేయకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు? అని ప్రశ్నించారు. 42 శాతం బీసీ లకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికల కు వెళ్ళేటట్లు కనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన విదంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అని డిమాండ్‌ చేశారు. ఒకవేళ ఇవ్వకుండా ఎన్నికలకు వెళితే… మా కార్యాచరణ వేరే విధంగా ఉంటుందని కవిత హెచ్చరించారు. బీసీలకు రిజర్వేషన్లు డిసైడ్ చేసి ఎన్నికలు పెట్టాలని అన్నారు. 2025 జనవరి 3 న ఇందిరా పార్కు దగ్గర సభ నిర్వహిస్తామని తెలిపారు. ఆ రోజు మా పూర్తి స్థాయి కార్యాచరణ ప్రకటిస్తామని కవిత అన్నారు.

Exit mobile version