MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ కేసుపై నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. మద్యం పాలసీ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటు పరిశీలన అంశంపై ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ జరగనుంది. కాగా, మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ అధికారులు మార్చి 15న అరెస్టు చేశారు. తీహార్ జైలులో ఉన్న కవితను ఇదే కేసులో ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే మద్యం కేసులో కవిత పాత్ర ఉందంటూ సీబీఐ పలు ఆధారాలతో ప్రాథమిక చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కవిత ప్రమేయంపై నేడు విచారణ జరగనుంది. కాగా, ఈ కేసు విచారణ కొనసాగుతుండగా, సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత బెయిల్ కోరుతుండగా.. బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరిస్తోంది.మధ్యంతర బెయిల్ కోసం కవిత తరఫు లాయర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాత్కాలిక బెయిల్ కోసం కవిత ఇటీవల కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Read also: Komatireddy: తెలంగాణా వచ్చినా నల్లగొండకు ప్రయోజనం లేదు..
అయితే.. ఏదైనా కేసులో నిందితుడికి కోర్టు విధించిన కస్టడీ గడువు ముగిసినా, విచారణ పూర్తయితే.. దర్యాప్తు సంస్థలు కోర్టును మరికొంత సమయం కోరుతాయి. దీంతో కోర్టు కస్టడీని పొడిగిస్తూనే ఉంది. మరణశిక్ష, జీవిత ఖైదు లేదా కనీసం పదేళ్ల జైలు శిక్ష విధించే కేసుల్లో కస్టడీ వ్యవధి గరిష్టంగా 90 రోజులు ఉంటుంది. ఇతర కేసుల విషయంలో గరిష్ట విచారణ సమయం 60 రోజులు. డిఫాల్ట్ బెయిల్ అనేది ఈ గడువు ముగిసినా కేసు విచారణ పూర్తికాకపోతే బెయిల్ పొందడం నిందితుడికి చట్టపరమైన హక్కు. కవిత కేసు గడువు ముగియడంతో, ఆమె తరపున న్యాయవాదులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరి ఈ బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Telangana Govt: కాంగ్రెస్ నేతలకు వైఎస్ఆర్ జయంతి కానుక.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..