NTV Telugu Site icon

Minister Seethakka: ధరణి ఎప్పుడు మారుస్తారని ప్రజలు అడుగుతున్నారు..

Seetakka

Seetakka

Minister Seethakka: ధరణి ఎప్పుడు మారుస్తారు అని ప్రజలు అడుగుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. పాత పెపర్ల పేరుతో.. ఇప్పుడు పట్టా మా పేరు మీద ఉంది అని వస్తున్నారని మండిపడ్డారు. కాస్తు కాలమే లేకుండా చేశారు మీరని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్‌ఓ లు తప్పులు చేస్తున్నారు అని తీసేశారని.. మరి సెట్ చేశారా? ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇచ్చిన భూములు కూడా లాక్కున్నారు మీరు..సిలింగ్ యాక్ట్ తుంగలో తొక్కారని అన్నారు. ఫార్మ్ హౌజ్ ల పేరుతో యాక్ట్ కి తూట్లు పొడుస్తున్నారని సీతక్క మండిపడ్డారు. ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు బంధు ఒకరికి దున్నేటోరు ఏమో మరొకరు రికార్డులో మార్చుకుందామన్న దాదాపు ధరణి వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తున్నాడు.

Read also: Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధించిన ఆ దేశం..

కానీ ఇప్పటికి దానిని మార్చుదామన్న ధరణి నిబంధనలు అడ్డు వస్తున్నాయి అన్నారు. ములుగులో నేనే సాక్ష్యం అంటూ అసెంబ్లీలో సీతక్క అన్నారు. మీరిచ్చినటు వంటి ధరణిలో ఇలాంటి చాలా వున్నాయని తెలిపారు. ఒకప్పుడు ఎంతో మంది భూపోరాటల ద్వారా భూములు సాధించుకున్నా భూములు వున్నాయి. భూములు అమ్ముకుని వచ్చిన వారికి కూడా మీరు పట్టా చేసిచ్చారని మండిపడ్డారు. అమ్ముకున్నారు పాపం ఈ భూమి కోసం మళ్లొస్తారని పట్టాల మీద అంత ఆశక్తి చూపలేకపోయారు. వీల్లు ఎప్పుడైతే రైతు బంధు, ధరణి తీసుకుని వచ్చిన తరువాత అమ్ముకున్న వారు కూడా మాకు కేసీఆర్‌ హయాంలో పట్టా వచ్చింది కాబట్టి ఇది మాదే అని వస్తున్నారని తెలిపారు.
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మాజీ మంత్రి.. బొత్స పేరును ప్రకటించిన జగన్‌