NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: ఆర్‌ అండ్‌ బీ సెక్షన్‌లో మంత్రి కోమటిరెడ్డి ఆకస్మిక తనిఖీలు..

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy: ఆర్‌ అండ్‌ బీ సెక్షన్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆర్ అండ్ బీ విభాగాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. సచివాలయంలో ఉద్యోగుల పనితీరును తెలుసుకునేందుకు మంత్రి వెళ్లారు. అక్కడి పరిస్థితి చూసి నిర్ఘాంతపోయారు. ఆర్ అండ్ బీ విభాగంలో ఆకస్మికంగా తనిఖీ చేయగా ఖాళీ కుర్చీలే దర్శనమివ్వడంతో షాక్ తిన్నారు. సమయం దాటినా చాలా మంది ఉద్యోగులు కార్యాలయానికి రాకపోవడంతో మంత్రి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా ఉద్యోగులు ఉదయం 10 గంటలకు కార్యాలయానికి రిపోర్టు చేయాలి.

Read also: Harish Rao: ఎన్నికలు రాక తప్పదు.. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకుండా ఉండదు..

తెలంగాణ సచివాలయంలో ఉదయం 11.00 గంటలు అయిన 80 శాతం ఉద్యోగులు ఆఫీసులకు రాకపోవడంపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసిస్టెంట్, అడిషినల్ సెక్రటరీ స్థాయి అధికారులు కూడా ఆఫీసులకు ఆలస్యంగా రావడంపై ప్రశ్నించారు. 11కి రాలేదు.. మళ్లీ 6కి వెళ్లిపోతారు.. మళ్లీ మధ్యలో ఆఫ్ అంటూ.. అధికారుల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు పలు వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి.. కొన్ని విషయాలపై అధికారులు స్పందించకపోవడంతో మీ వివరాలు కూడా మీకు తెలుసా? అంటూ ఫైర్ అయ్యారు. ఉద్యోగులు సమయపాలన పాటించాలని వార్నింగ్ ఇచ్చారు. ఇలాగే కొనసాగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మంత్రి వచ్చిన ఇప్పటి వరకు ఉద్యోగులు రాకపోవడం ఏంటని మండిపడ్డారు. ఉద్యోగులు రోజూ ఇలానే వస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. మొదటిసారి తనిఖీ కావడంతో.. వదిలేస్తున్నాని ఇదే మళ్లీ రిపీట్ అయితే.. చర్యలు తప్పవని హెచ్చరించారు.
Real Estate: యవతిపై ఇద్దరు రియల్ ఎస్టేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌ ల అత్యాచార యత్నం..