Site icon NTV Telugu

MGBS Bus Stand: నీట మునిగిన ఎంజీబీఎస్ బస్టాండ్.. చిక్కుకుపోయిన ప్రయాణికులు..

Mgbs

Mgbs

MGBS Bus Stand: హైదరాబాద్ మహానగరంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎంజీబీఎస్ బస్టాండ్‌ నీట మునిగింది. బస్టాండు లోపల వరద నీరు ఉధృతిగా ప్రవహించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎంజీబీఎస్ నుంచి బయటికి రావడానికి వీలు లేక పోవడంతో లోపలే చిక్కుకుపోయారు. ఇక, ప్రమాదకరంగా ప్రవాహిస్తున్న నీటిలోనే కొందరు ప్రయాణికులు బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కొక్కరుగా చేతులు పట్టుకొని బయటకు తీసుకు వస్తున్నారు.

Read Also: Pakistan: భారత్‌పై మేమే గెలిచాం.. యూఎన్‌లో పాక్ పీఎం అబద్ధాలు..

MGBS బస్టాండ్ నీట మునగడంపై Ntv effectతో హైడ్రాతో పాటు పోలీసులు స్పందించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మున్సిపల్ శాఖ, హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టాయి. గండిపేట గేట్లు ముందస్తు హెచ్చరిక లేకుండా ఎత్తేయడంతో నీటి ఉధృతి పెరిగి అల్లకల్లోలం ఏర్పడిందని హైడ్రా సిబ్బంది తెలిపింది.

Exit mobile version