Site icon NTV Telugu

Meerpet Water Flood: బయటికి రాలేము, ఎటూ వెళ్ళలేము.. మిథిలా నగర్ వాసుల ఆవేదన..

Meerpet Water Flood

Meerpet Water Flood

Meerpet Water Flood: హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురవడంతో ప్రధాన రహదారులు మోకాలి లోతులో నీళ్లు నిలిచి చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. మురికివాడలు, కాలనీల్లోనే కాదు ఇళ్లలోకి వరద పోటెత్తింది. హైదరాబాద్ మీర్పేట్ లోని మిథిలా నగర్, సత్య సాయి నగర్ లో నీట మునిగిన ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం కాలనీ వాసులు మాట్లాడుతూ.. గత ముడు రోజులుగా మా కలనిలోకి వరద నీరు వచ్చి చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మిథిలా నగర్ , సత్య సాయి నగర్ లో మా పరిస్థితి దారుణంగా ఉందని కన్నీరుమున్నీరుగా విలపించారు. బయటికి రాలేము, ఎటు వెళ్ళలేని పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు.

గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువన ఉన్న మంత్రాల చెరువు, పెద్ద చెరువు నిండి వరదనీరు కాలనిలోకి భారీగా చేరుతోందని తెలిపారు. వరద నీటి కోసం గతంలో వేసిన ట్రాంక్ పైప్ లైన్లు మూసుకుపోవడంతో ఇళ్లలోకి వరద నీరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ ఎన్ టి పి నాలా పనులు చేపట్టారని, కానీ భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా పైప్ లైన్ ద్వారా వెళ్లాల్సిన వాటర్ ఫలితం ఇవ్వలేదన్నారు. దీంతో మిథిలా నగర్, సత్య సాయి నగర్ లో భారీగా వరద నీరు చేరుతుందని వాపోతున్నారు. అధికారులు వస్తున్నారు చూస్తున్నారు కానీ.. శాశ్వత పరిష్కారం లేదని తెలిపారు. ఆఫీస్ కి వెళ్ళాలన్నా, పిల్లలు స్కూలుకు వెళ్లాలని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, జీహెచ్ఎంసీ మా కాలనీ వాసులు ఇబ్బందులపై దృష్టి పెట్టి.. పనులు పూర్తి చేయాలని వేడుకుంటున్నారు.
CM Chandrababu Naidu: నేడు సీఎం చంద్రబాబు కీలక సమీక్షలు..

Exit mobile version