Meerpet Water Flood: బయటికి రాలేము, ఎటూ వెళ్ళలేము.. మిథిలా నగర్ వాసుల ఆవేదన..
- హైదరాబాద్ మీర్పేట్ లోని మిథిలా నగర్- సత్య సాయి నగర్ లో నీట మునిగిన ఇల్లు..
- గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా చేరిన వరద..
- వరద నీటి కోసం వేసిన పైప్ లైన్లు మూసుకుపోవడంతో ఇళ్లలోకి చేరిన నీరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meerpet Water Flood: హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురవడంతో ప్రధాన రహదారులు మోకాలి లోతులో నీళ్లు నిలిచి చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. మురికివాడలు, కాలనీల్లోనే కాదు ఇళ్లలోకి వరద పోటెత్తింది. హైదరాబాద్ మీర్పేట్ లోని మిథిలా నగర్, సత్య సాయి నగర్ లో నీట మునిగిన ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం కాలనీ వాసులు మాట్లాడుతూ.. గత ముడు రోజులుగా మా కలనిలోకి వరద నీరు వచ్చి చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మిథిలా నగర్ , సత్య సాయి నగర్ లో మా పరిస్థితి దారుణంగా ఉందని కన్నీరుమున్నీరుగా విలపించారు. బయటికి రాలేము, ఎటు వెళ్ళలేని పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువన ఉన్న మంత్రాల చెరువు, పెద్ద చెరువు నిండి వరదనీరు కాలనిలోకి భారీగా చేరుతోందని తెలిపారు. వరద నీటి కోసం గతంలో వేసిన ట్రాంక్ పైప్ లైన్లు మూసుకుపోవడంతో ఇళ్లలోకి వరద నీరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ ఎన్ టి పి నాలా పనులు చేపట్టారని, కానీ భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా పైప్ లైన్ ద్వారా వెళ్లాల్సిన వాటర్ ఫలితం ఇవ్వలేదన్నారు. దీంతో మిథిలా నగర్, సత్య సాయి నగర్ లో భారీగా వరద నీరు చేరుతుందని వాపోతున్నారు. అధికారులు వస్తున్నారు చూస్తున్నారు కానీ.. శాశ్వత పరిష్కారం లేదని తెలిపారు. ఆఫీస్ కి వెళ్ళాలన్నా, పిల్లలు స్కూలుకు వెళ్లాలని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, జీహెచ్ఎంసీ మా కాలనీ వాసులు ఇబ్బందులపై దృష్టి పెట్టి.. పనులు పూర్తి చేయాలని వేడుకుంటున్నారు.
CM Chandrababu Naidu: నేడు సీఎం చంద్రబాబు కీలక సమీక్షలు..
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!