NTV Telugu Site icon

VC.Sajjanar: మహిళా కండక్టర్‌ కు ఎండీ సజ్జనార్‌ అభినందనలు.. కారణం ఇదీ..

Vc Sajjanar

Vc Sajjanar

VC.Sajjanar: మహిళా కండక్టర్‌ కు టీజీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అభినందనలు తెలిపారు. రక్షాబంధన్‌ సందర్భంగా బస్సులో గర్భిణిపై పురుడు పోసిన కండక్టర్ భారతిని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం తరపున ఎండీ సజ్జనార్ అభినందించారు. కండక్టర్ సకాలంలో డెలివరీ చేయడం, బస్సులోనే నర్సు ప్రయాణం చేస్తుండటంతో ఆమె కూడా సాయం చేయడంతో తల్లీ బిడ్డ క్షేమంగా బయటపడ్డారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూ ఆర్టీసీ ఉద్యోగులు సామాజిక బాధ్యతగా సేవాభావాన్ని ప్రదర్శించడం గొప్ప విషయమన్నారు. ప్రయాణంలో ఓ గర్భణీకి పురుడు పోసిన భారతిని సభాష్ అంటూ సజ్జనార్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

Read also: Raksha Bandhan-2024: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన సీతక్క..

రాఖీ పండుగ రోజు ఓ మహిళా కండక్టర్ తెలంగాణ ఆర్టీసీ బస్సులో గర్భిణికి ప్రసవం చేసి మానవత్వం ప్రదర్శించింది. తాను విధులు నిర్వహిస్తున్న బస్సులోనే గర్భిణికి ప్రసవ నొప్పులు రావడంతో వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తున్న నర్సు సహాయంతో గర్భణికి పురుడు పోసింది. అనంతరం తల్లీబిడ్డలను స్థానిక ఆస్పత్రికి తరలించడంపై సజ్జనార్ ఆనందం వ్యక్తం చేశారు. అయితే.. ఇవాళ (సోమవారం) ఉదయం గద్వాల-వనపర్తి రూట్ పల్లె వెలుగు బస్సులో రక్షాబంధనం సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు గద్వాల డిపోనకు చెందిన సంధ్య అనే గర్భిణి వనపర్తికి వెళుతోంది. బస్సు నాచహళ్లి చేరుకోగానే గర్బిణికి ఒక్కసారిగా కడుపునొప్పి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ జి.భారతి బస్సును ఆపింది. అదే బస్సులో ప్రయాణిస్తున్న ఓ నర్సు సహాయంతో గర్భిణిని పురుడు చేశారు. ఆ మహిళ పండెంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం 108 సహాయంతో తల్లీబిడ్డలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు.
Bandi Sanjay: చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలి.. బండి సంజయ్‌ డిమాండ్‌..