Site icon NTV Telugu

Mallareddy Mass Dance: బతుకమ్మ సంబరాల్లో మల్లారెడ్డి మాస్ డ్యాన్స్

Mallareddy

Mallareddy

Mallareddy Mass Dance: పాలమ్మినా, పూలమ్మినా అనే డైలాగ్ వింటేనే మాజీ మంత్రి మల్లారెడ్డి గుర్తొస్తారు. ఆయన సాధాణంగా మాట్లాడిన మాటలు ఒక్కసారిగా సోషల్​ మీడియాలో ట్రెండ్​ అయ్యాయి. అప్పటి నుంచి మల్లారెడ్డి ఏం మాట్లాడినా.. ఏం చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాల్సిందే. తాజాగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మాస్ స్టెప్పులు వేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మ గూడ లో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మాజీ మంత్రి, స్థానిక శాశనసబ్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొని విద్యార్థుణులు, మహిళల లతో కలసి ఆడి పాడి సందడి చేశారు.. మేడ్చల్ జిల్లా మైసమ్మ గూడ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్, ఆవరణలో జరిగిన దసరా ఉత్సవాలలో భాగంగా బతుకమ్మ పండుగ సంబరాలు, దాండియా కార్యక్రమం, డి.జే పాటలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి కళాశాల విద్యార్ధుణులు, కళాశాల మహిళల సిబ్బందితో కలిసి పోటీ పడుతూ ఆటలు ఆడి, పాటలకు అనుగుణంగా డాన్స్ లు చేస్తూ అందరిని ఉత్సాహ పరిచారు. ఈ కార్యక్రమంలో ఎమ్మల్యే సతీమణి చామకూర కల్పన రెడ్డి, చామకూర షాలిని రెడ్డి, ప్రిన్సిపాల్ మాధవిలత, కళాశాల సిబ్బంది, విద్యార్థినిలు, తదితరులు పాల్గొన్నారు.

Terrible Incident: తాగొచ్చి గొడవ చేసిన తండ్రి.. కిరాతకంగా హతమార్చిన కొడుకు..

Exit mobile version