Hyderabad: శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శ్రీనగర్ ఎల్లారెడ్డిగూడెలో హై టెన్షన్ కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. ప్రభుత్వ స్కూల్ పై కరెంటు లైన్ తెగిపడింది. ప్రమాదం గుర్తించిన యాజమాన్యం విద్యార్థులను స్కూల్ నుంచి బయటకు తీసుకుని వచ్చారు. దీంతో విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పంది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవాసాల మధ్య నుంచి 34 కేవి హై టెన్షన్ లైన్ తొలగించాలంటూ ఆందోళన చేపట్టారు. శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ముందు స్థానికుల నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడకు పోలీసులు భారీగా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. స్థానికులతో కలిసి సోమాజిగూడ కాంగ్రెస్ కార్పొరేటర్ ఆందోళనకు దిగారు.
Read also: CM Revanth Reddy: మీ ప్రకటనలో అపోహలు.. అవాస్తవాలు.. ప్రధాని మోడీ కి సీఎం రేవంత్ ట్వీట్..
ఎల్లారెడ్డిగూడ శ్రీనగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ.. ఎల్లారెడ్డిగూడ శ్రీనగర్ కాలనీ లో ఉదయం హై టెన్షన్ కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. పెద్ద శబ్దం వచ్చింది భయంతో ఇంట్లో నుండి అందరం పరుగులు తీశామన్నారు. సబ్ స్టేషన్ పక్కనే ప్రభుత్వ పాటశాలపై కరెంటు వయర్ తెగి పడిందని అన్నారు. అదృష్టం బాగుండి విద్యార్థులకు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అన్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించారు. జనవాసాల మధ్య నుంచి 34 కేవి హై టెన్షన్ లైన్ తొలగించాలని గతంలో ఎన్నో సార్లు ఆందోళన చేసామమన్నారు. శ్రీనగర్ కాలనీ 34కేవీ సబ్ స్టేషన్ ముందు ఆందోళన చేసాము ఇప్పటివరకు ఎవరు స్పందించలేదన్నారు. గతంలో ఇలాగే హై టెన్షన్ వైర్స్ తెగిపడి కరెంట్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందిందని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి హైటెన్షన్ కరెంట్ వైర్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. మరి దీనిపై అధికారుల వద్ద నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
Ponnam Prabhakar: దేశం మొత్తానికి సమగ్ర సర్వే దిక్సూచి.. నవంబర్ 6 నుండి ప్రారంభం..