Lal Darwaza Bonalu: ఆషాడమాసంలో తెలంగాణలోనే ప్రసిద్దిచెందిన బోనాలపండుగకు ఓల్డ్ సిటీ ముస్తాబయ్యింది. ఇప్పటికే ఆలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా శోభాయమానంగా తీర్చిదిద్దారు. తెలంగాణలో అత్యంత వైభవంగా జరుగనున్న లాల్‌దర్వాజా బోనాల నవరాత్రి ఉత్సవాలు ఇవాళ ధ్వజారోహణ, శిఖర పూజలతో అట్టహాసంగా ప్రారంభంకానున్నాయి. ఈ నెల 21 వ తేదీన ఆదివారం సాయంత్రం శాలిబండ శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం నుంచి అమ్మవారి ఘటం భారీ ఊరేగింపుగా తీసుకు వచ్చి ఆలయాల్లో ప్రతిష్టాపన, తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి వివిధ రూపాలలో ప్రత్యేక పూజల అనంతరం ఈ నెల 28 వ తేదీన బోనాల పండుగ, 29 వ తేదీన రంగం భవిష్యవాణి, సామూహిక ఘటాల నిమజ్జన ఊరేగింపుతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఇవాళ సింహవాహిని మహంకాళి దేవాలయం బోనాల ఉత్సవాలను నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు.
Read also: Telangana Assembly: 23 నుంచి అసెంబ్లీ భేటీ.. 25న బడ్జెట్..
మరోవైపు అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయ బోనాల ఉత్సవాలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించనున్నారు. ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం బోనాల ఉత్సవాలను ఛండీఉపాసకులు మనోజ్ శర్మ , సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాలు ప్రారంభించనున్నారు. గౌలిపురా శ్రీ మహంకాళి మాతేశ్వరి, భారత మాత దేవాలయం బోనాల ఉత్సవాలను ఆలయ కమిటీ చైర్మన్ ఎర్మని కైలాష్ లు గణపతి హోమం, కలుషస్థాపనతో ప్రారంభించనున్నారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాలలో దర్శనమివ్వనున్నారు. ఇలా పాతబస్తీలోని 28 ప్రధాన దేవాలయాలలో అమ్మవారికి అభిషేకం, శిఖరపూజ, ధ్వజా రోహణ, కలశస్థాపనతో బోనాల నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. పాతబస్తీలోని 28 ప్రధాన దేవాలయాలతో పాటు మరో 330 ఆలయాలను ఈ సందర్భంగా ఆలయాలను రంగురంగుల విద్యుత్‌దీపాలతో అత్యంత శోభాయమానంగా సుందరంగా అలంకరించారు.
Read also:
ఈనెల 28వ తేదీన దేవాలయాల వారిగా పట్టు వస్త్రాలు సమర్పించే మంత్రుల వివరాలు
1.శ్రీ లాల్ దర్వాజా సింహవాహిని ఆలయం – డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
2. శ్రీ అక్కన్న మాదన్న ఆలయం, శాలిబండ – మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
3.శ్రీ భాగ్య లక్ష్మి ఆలయం, చార్మినార్ – మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి
4.శ్రీ దర్బార్ మైసమ్మ టెంపుల్ , కర్వాన్ – మంత్రి దామోదర రాజనర్సింహ
5.శ్రీ మహంకాళి టెంపుల్, మిరాలం మండి – మంత్రి జూపల్లి కృష్ణారావు
6.నల్ల పోచమ్మ ఆలయం, సబ్జి మండి – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
7.శ్రీ కట్ట మైసమ్మ ఆలయం, చిలకలగూడ – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
8. శ్రీ ఖిలా మైసమ్మ ఆలయం , ఎన్టీఆర్ నగర్ సరూర్ నగర్ – మంత్రి దనసరి అనసూయ సీతక్క
9. శ్రీ మహంకాళి సహిత మహకాళేశ్వర స్వామి ఆలయం , నాచారం ఉప్పల్ – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Rajanna Sircilla: మమ్మల్ని వదిలి వెళ్లకండి సార్.. వెక్కి వెక్కి ఏడ్చిన విద్యార్థులు..