MLA Madhavaram: ప్రజలను సంక్షేమ పథకాల నుండి దారి మళ్లించేందుకు హైడ్రా కూల్చివేతలు మొదలు పెట్టారని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కూకట్‌పల్లి నల్ల చెరువులో హైడ్రా కూల్చివేతల పై ఎమ్మెల్యే మాధవరం ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం, ఆదివారం వస్తుందంటే హైదారాబాద్ లో ప్రజలు భయంతో ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. కూల్చివేతలు చేసాక డిబ్రిస్ తీసివేయకుండా, చెత్తను జమ చేస్తున్నారని మండిపడ్డారు. నల్ల చెరువులో నిన్న కూల్చివేతలు చేపట్టిన స్థలం పట్టదారులకు చెందిందన్నారు. పట్టాదారులకు ఏ విధమైన న్యాయం చేయనున్నారు? అని ప్రశ్నించారు.
చెరువులలో పట్టాలు ఉన్న వారికి నష్ట పరిహారం చెల్లించి, ఆ స్థలాన్ని ప్రభుత్వం తీసుకోవాలన్నారు. నిన్న షెడ్లు కూల్చివేస్తున్న సమయంలో అక్కడ ఉంటున్న వారికి కనీసం వారి సామాన్లను తరలించేందుకు సైతం సమయం ఇవ్వకపోవడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా విధి విధానాలను స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి నోటీసులు ఇచ్చి, ఉదయాన్నే కూల్చి వేస్తే అక్కడ ఉంటున్న వారి పరిస్థితి ఏంటి?? అని ప్రశ్నించారు. నిన్న కూల్చివేతలలో నష్టపోయిన వారికి నష్ట పరిహారం చెల్లించాలన్నారు. శనివారం, ఆదివారం హైడ్రా కాదు హైడ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా నిన్న కూల్చివేతలు చేపట్టారు.. ప్రజలను సంక్షేమ పథకాల నుండి దారి మళ్లించేందుకు హైడ్రా కూల్చివేతలు చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
Kamareddy: దారుణం.. డబ్బులు కట్టలేదని వేసిన కుట్లు విప్పేశారు..