NTV Telugu Site icon

KTR Open Letter: ఎందుకు మౌనంగా ఉన్నారు?.. రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ..

Ktr Rahul Gandhi

Ktr Rahul Gandhi

KTR Open Letter: పులకేసి మాదిరిగా మీ ముఖ్యమంత్రి ప్రజలను హింసిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటూ రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనలో పదేళ్ల విధ్వంసం సృష్టిస్తున్నారు. తెలంగాణ ప్రజలు పిలిస్తే క్షణాల్లో వస్తానన్న రాహుల్ గాంధీ ఇన్నాళ్లు ఎక్కడ దాక్కుకున్నారు? అని ప్రశ్నించారు. గాంధీ భవన్ కు కాదు… ప్రజల దగ్గరకు వెళ్లే దమ్ముందా? అన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల పేరుతో మోసం చేసినందుకు తెలంగాణ ప్రజలకు ముందు క్షమాపణ చెప్పాలన్నారు. ఏడాదిలోనే అన్ని వర్గాలను రోడ్డెక్కించిన ఘనత మీ ప్రభుత్వానిదే అన్నారు. సబ్బండ వర్గాలను మోసం, నయవంచనకు గురి చేసిన పాపంలో ప్రధాన పాత్ర మీదే అని తెలిపారు. మీ వైఫల్యాలు చిత్రగుప్తుడి చిట్టా అంతా ఉన్నాయన్నారు.

Read also: Pawan Kalyan : వీరమల్లును ఢీకొట్టేందుకు వస్తున్న ఆ ఇద్దరు.. పోరులో గెలిచేదెవరు ?

పులకేసి మాదిరిగా మీ ముఖ్యమంత్రి ప్రజలను హింసిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? అని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే హైడ్రా, మూసీ బాధితులకు వద్దకు వెళ్లాలన్నారు. మీ చేతగాని పాలనతో రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్ల ఉసురు పోసుకున్నారని తెలిపారు. పార్టీ ఫిరాయింపులతో రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్న మీ ముఖ్యమంత్రికి ఎందుకు అండగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అనుమతితోనే అదానీతో దోస్తీ, మూసీ ప్రాజెక్ట్ చేపడుతున్నారని తెలిపారు. అభివృద్ది పథంలో ఉన్న తెలంగాణను అవీనీతి తెలంగాణాగా మార్చారన్నారు. తెలంగాణ ప్రజల తరఫున అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అధికారం కోసం హమీలిచ్చి సబ్బండ వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ తరపున మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.
Telangana TET Notification: తెలంగాణ టెట్ 2024 నోటిఫికేషన్ విడుదల..