NTV Telugu Site icon

KTR Tweet: సీఎం రేవంత్‌రెడ్డికి ఆల్‌ ది బెస్ట్‌ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌..

Ktr Tweet

Ktr Tweet

KTR Tweet: తెలంగాణకు మరిన్ని విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా, దక్షిణ కొరియాలకు వెళ్లింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున బృందం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలకు వెళుతోంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి, మంత్రి శ్రీధర్ బాబుకు నా శుభాకాంక్షలు.. ఆల్‌ ది బెస్ట్‌ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి విదేశాల్లోని ప్రముఖ కంపెనీలతో వారు పెంచుకున్న సంబంధాలు ఇప్పుడు రాష్ట్రానికి మేలు చేస్తున్నాయి. అలుపన్నది లేకుండా పట్టుదలతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చాం.

Read also: Ambati Rayudu: ఏదీ అవసరం లేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థనను తిరస్కరించిన అంబటి రాయుడు!

వాటిని చూస్తుంటే నేడు రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రావడం సంతోషకరమన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రాధాన్యం ఇచ్చాం అని కేటీఆర్ అన్నారు. టీఎస్-ఐపాస్‌లో ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలకు ఆకర్షితులై అనేక కంపెనీలు రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. గత దశాబ్దంలో ప్రయివేటు రంగంలో రూ.4 లక్షల కోట్లకు పైగా ఉద్యోగాలను సృష్టించాం. రాజకీయాలు పక్కన పెడితే నాకు, బీఆర్‌ఎస్ పార్టీకి తెలంగాణే ముందు. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకొచ్చి, తాము ఏర్పాటు చేసిన బలమైన పునాదిపై తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో విజయం సాధిస్తుందని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను.. జై తెలంగాణ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Ambati Rayudu: ఏదీ అవసరం లేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థనను తిరస్కరించిన అంబటి రాయుడు!