KTR: కొండా సురేఖ.. దొంగ ఏడుపులు, పెడబొబ్బలు దేనికి? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ తరఫున ఆమె పై ఎవరు మాట్లాడలేదన్నారు. ఇదే సోషల్ మీడియాలో మాపైన ట్రోలింగ్ పేరుతో దాడి జరగడం లేదా? అని ప్రశ్నించారు. కొండా సురేఖ గతంలో ఉచ్చ ఆగడం లేదా అని అనలేదా?… ఇంకా ఆమె గతంలో మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. ఈ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు ఎందుకు? అని మండిపడ్డారు. గతంలో కొండా సురేఖ మాట్లాడిన వీడియోలు పంపిస్తా మీకు కావాలంటే అని తెలిపారు. ఇదే కొండా సురేఖ గారు హీరోయిన్ల ఫోన్లు టాప్ చేశారని కామెంట్లు చేశారు. ఆమె ఆరోపణలు చేసిన వాళ్లు మహిళలు కాదా? వాళ్లకు మనోభావాలు ఉండవా? అన్నారు. మాపైన అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడ లేదా? వాళ్ళు ఏడ్వరా…?? అని మండిపడ్డారు.
Read also: Pandu Ranga Temple: ఆ గుడికి వేల సంఖ్యలో మందుబాబులు క్యూ కడుతారు.. ఎందుకో తెలుసా?
ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ మీకు, మంత్రులకు పంపిస్తా అన్నారు. వెంటనే ముఖ్యమంత్రి నోటిని ఫినాయిల్ వేసి కొండా సురేఖ, మంత్రులు కలిసి కడగాలన్నారు. మంత్రి వెంకట్ రెడ్డికి మూసీ గురించి అవగాహన లేదు. ఆయనకి ఏం తెలువదని కీలక వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దమ్ముంటే మూసీ పరివాహాక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను ఒప్పించాలన్నారు. అప్పుడు వెంకటరెడ్డికి మూసీ వద్ద ఉన్న ప్రజలు సన్మానం కూడా చేస్తారన్నారు. వెంకట్ రెడ్డికి మూసీ గురించి అవగాహన లేదు. ఆయనకి ఏం తెలువదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ పైన ఉన్న సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీ) లపై కూడా ఆయన అవగాహన లేదన్నారు. ఎస్టీపీలు పూర్తి అయిన తర్వాత మూసీలో మురికి నీళ్లు ప్రక్షాళణ అవుతాయన్నారు.
Health Tips: టీ తాగుతూ సిగరెట్ తాగుతున్నారా..?