NTV Telugu Site icon

KTR: ఏపీ సీఎం చంద్రబాబుపై కేటీఆర్ ప్రశంసలు..

Ktr Chandrababu

Ktr Chandrababu

KTR: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. పెన్షన్ పెంపుపై ఏపీ సీఎం మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి అయిన వారంలోనే ఏపీలో వృద్దులకు చంద్రబాబు పెన్షన్ పెంచారని అన్నారు. కానీ.. పెన్షన్ల పెంపుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో చిట్టినాయుడు సోదరుల కంపెనీ నడుస్తుందన్నారు. రైతు బంధు, భరోసా కాదు..సీఎం కుర్చి కే భరోసా లేదన్నారు.
హైదరాబాద్ లో మనం క్లీన్ స్వీప్ చేసిన్నామన్నారు. బీఆర్ఎస్ అన్ని సీట్లు గెలిచినామన్నారు. అందుకే రేవంత్ రెడ్డి నగర ప్రజల పై కక్ష కట్టారన్నారు. పేదల ఇండ్లు కూలగొడుతున్నారని మండిపడ్డారు. సెటిల్మెంట్ లు జరిగే మాదాపూర్ లోని తిరుపతి రెడ్డి ఇంటిని ఎందుకు కూల్చట్లేదన్నారు. తిరుపతి రెడ్డి కి ఒక న్యాయం.. పెదవాళ్ళకి ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. కోర్టులు పనిచేయని శనివారం ఆదివారం వచ్చి కూల్చుతున్నారని మండిపడ్డారు. హీరో నాగార్జున కన్వెన్షన్ కు కూల్చివేశారని గుర్తు చేశారు. దానికి అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నే అన్నారు. అనుమతులు ఇచ్చిన అధికారులను ఎందుకు శిక్షించట్లేదు? అని ప్రశ్నించారు.
పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ను ఎందుకు కూల్చట్లేదన్నారు. మంత్రుల ఫామ్ హౌస్ లు ఎందుకు ముట్టు కోవట్లేదని మండిపడ్డారు. నగరంలో మేము లక్ష ఇండ్లు కట్టినామని క్లారిటీ ఇచ్చారు. హైడ్రా కూల్చిన పేదలకు ఆ లక్ష డబుల్ బెడ్ రూముల్లో కేటాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
V. Hanumantha Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. టార్గెట్ కేటీఆర్, హరీష్ రావు