NTV Telugu Site icon

KTR: కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా.. నాంపల్లి కోర్టులో విచారణ

Ktr

Ktr

మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ క్రమంలో.. కేటీఆర్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతుంది. తన ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టును కోరుతూ కేటీఆర్ పిటిషన్ వేశారు.

Read Also: Nagarjuna–Konda Surekha: నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కొండా సురేఖకు నోటీసులు..

మంత్రి హోదాలో ఉంటూ కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేసిందని కేటీఆర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, తొమ్మిదేళ్లు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాను.. దేశ విదేశాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి అవార్డులు పెట్టుబడులను తీసుకొచ్చాను.. బెస్ట్ ఐటీ మినిస్టర్‌గా 2020లో అవార్డు తీసుకున్నానని తెలిపారు. కొన్ని ఛానల్స్‌లో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను చూశాను.. తనపై చేసిన వ్యాఖ్యలన్నీ తప్పుడు ఆరోపణలు అని పేర్కొన్నారు. తన పరువుకు తీవ్ర నష్టం వాటిళ్ళేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేసిందని కేటీఆర్ పిటిషన్ లో తెలిపారు.

Read Also: Manchu Vishnu: మంచు విష్ణుకి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌ తొలగించాలి!

ఈ క్రమంలో.. కోర్టుకు మంత్రి కొండా సురేఖ మాట్లాడిన వీడియోలను, ఆడియోలను, స్క్రీన్ షాట్లను కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు సబ్మిట్ చేశారు. బీఎన్ఎస్‌లోని 356 సెక్షన్ కింద కొండా సురేఖపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 23 రకాల ఎవిడెన్స్‌లను కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు సబ్మిట్ చేశారు.

Show comments