NTV Telugu Site icon

KTR Comments: ఈనెల 29 తెలంగాణ ప్రజలు మరిచి పోలేని రోజు..

Ktr

Ktr

KTR Comments: ఈనెల (నవంబర్) 29వ తేదీ తెలంగాణ ప్రజలు మరిచి పోలేని రోజని బీఆర్‌ఎస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ చేసిన దీక్ష మైలు రాయిగా ఉందన్నారు. అందుకే నవంబర్ 29 దీక్ష దివస్ చేసుకుంటున్నామన్నారు. తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులు మళ్లీ ఏర్పడ్డాయన్నారు. ఆరోజు తెలంగాణ కోసం దీక్ష చేస్తే… ఇప్పుడు కాంగ్రెస్ అరాచకాలపై మరోసారి దీక్షలు చేయాలని అనుకుంటున్నామన్నారు. నవంబర్ 29 నాడు 33 జిల్లాలో దీక్ష దివస్ చేయబోతున్నామన్నారు. ప్రతి జిల్లాలో సీనియర్ నాయకులు పాల్గొంటారన్నారు. డిసెంబరు 9న మేడ్చల్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు అందరం పాల్గొంటామన్నారు. నవంబర్ 29 న నిమ్స్ ఆసుపత్రిలో కూడా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. కేసీఆర్ ఎక్కడా పాల్గొనరు.. కానీ ఆయన స్ఫూర్తి తోనే దీక్ష దివస్ చేస్తామన్నారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన నిరాహారదీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాది పడిందన్నారు. ఈ నిరాహార దీక్ష యావత్ భారత రాజకీయ వ్యవస్థను కుదిపేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వమే ప్రకటించేలా చేసిందన్నారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. ఈ నెల 29న కరీంనగర్ లో జరిగే దీక్షా దివస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొననున్నారని, ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Bhatti Vikramarka: సమగ్ర సర్వేలో డేటా ఎంట్రీ దశ చాలా ముఖ్యమైంది.. వీడియో కాన్ఫరెన్స్‌ లో భట్టి విక్రమార్క

Show comments