KTR Comments: ఈనెల 29 తెలంగాణ ప్రజలు మరిచి పోలేని రోజు..
- తెలంగాణ సాధనలో కేసీఆర్ చేసిన దీక్ష మైలు రాయిగా ఉంది..
- అందుకే నవంబర్ 29న దీక్ష దివస్ చేసుకుంటున్నాం..
- తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులు మళ్లీ ఏర్పడ్డాయి..
- నవంబర్ 29 నాడు 33 జిల్లాలో దీక్ష దివస్ చేయబోతున్నాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Comments: ఈనెల (నవంబర్) 29వ తేదీ తెలంగాణ ప్రజలు మరిచి పోలేని రోజని బీఆర్‌ఎస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ చేసిన దీక్ష మైలు రాయిగా ఉందన్నారు. అందుకే నవంబర్ 29 దీక్ష దివస్ చేసుకుంటున్నామన్నారు. తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులు మళ్లీ ఏర్పడ్డాయన్నారు. ఆరోజు తెలంగాణ కోసం దీక్ష చేస్తే… ఇప్పుడు కాంగ్రెస్ అరాచకాలపై మరోసారి దీక్షలు చేయాలని అనుకుంటున్నామన్నారు. నవంబర్ 29 నాడు 33 జిల్లాలో దీక్ష దివస్ చేయబోతున్నామన్నారు. ప్రతి జిల్లాలో సీనియర్ నాయకులు పాల్గొంటారన్నారు. డిసెంబరు 9న మేడ్చల్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు అందరం పాల్గొంటామన్నారు. నవంబర్ 29 న నిమ్స్ ఆసుపత్రిలో కూడా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. కేసీఆర్ ఎక్కడా పాల్గొనరు.. కానీ ఆయన స్ఫూర్తి తోనే దీక్ష దివస్ చేస్తామన్నారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన నిరాహారదీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాది పడిందన్నారు. ఈ నిరాహార దీక్ష యావత్ భారత రాజకీయ వ్యవస్థను కుదిపేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వమే ప్రకటించేలా చేసిందన్నారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. ఈ నెల 29న కరీంనగర్ లో జరిగే దీక్షా దివస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొననున్నారని, ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Bhatti Vikramarka: సమగ్ర సర్వేలో డేటా ఎంట్రీ దశ చాలా ముఖ్యమైంది.. వీడియో కాన్ఫరెన్స్ లో భట్టి విక్రమార్క
Also Read
తాజావార్తలు
-
Isaignani Ilaiyaraaja: స్వరాల దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇళయరాజా ప్రస్థానంలో ఎవ్వరికీ తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!
-
Komatireddy Venkat Reddy : పవన్‌కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
-
WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
-
CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
-
RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!