Koti Deepotsavam 2026 Day 6: కార్తీక శుద్ధ దశమి.. కోటి దీపోత్సవంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే..!

Koti Deepotsavam 2026 Day 6

Koti Deepotsavam 2026 Day 6

Koti Deepotsavam 2026 Day 6: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా కోటి దీపోత్సవం 2026 వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నేడు (నవంబర్ 19, గురువారం) ఆరో రోజు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కార్తీక శుద్ధ దశమి సందర్భంగా స్వామివారి ప్రత్యేక పూజలు, ప్రవచనాలు, కల్యాణోత్సవం, వాహన సేవతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆహ్వానం పలుకుతోంది రచనా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాజమాన్యం..

నేటి కార్యక్రమాల షెడ్యూల్ (నవంబర్ 19, గురువారం)

1. అనుగ్రహ భాషణం: శ్రీ స్వస్వరూపానందగిరి స్వామీజీ (శ్రీవాసనందగాపురం శ్రీలలితాపీఠం), అనంతరం రామకృష్ణ మరం స్వామీజీల కార్యక్రమాలు.

2. ప్రవచనామృతం: బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి ప్రవచనం.

3. వేదికపై పూజ: సద్గురు షిరిడీ సాయినాథునికి నిజపాదుక పూజ.

4. భక్తులచే పూజ: సాయిబాబా విగ్రహాలకు కోటీపుష్పార్చన.

5. కల్యాణం: ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణం.

6. వాహన సేవ: కల్పవృక్ష వాహనంపై స్వామివారి సేవ.

కార్తీక మాసంలో జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో నేటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అనుగ్రహ భాషణం నుంచి స్వామివారి కల్యాణం, కల్పవృక్ష వాహన సేవ వరకు వివిధ కార్యక్రమాలతో కోటి దీపోత్సవం ఆరో రోజు భక్తిభావంతో సాగనుంది. ఇక, ప్రతి రోజూ లాగే.. కోటి దీపోత్సవం వేదికగా సాగే పూజలు, దీపారాధనకు అవసరమైన సామాగ్రిని నిర్వహకులే ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం విదితమే.. ఇవాళ్టి కార్యక్రమంలో కూడా పాల్గొనాలని.. ఈ కోటి దీపాల యజ్ఞంలో పాలుపంచుకోవాలని ఆహ్వానం పలుకుతున్నారు నిర్వాహకులు..