NTV Telugu Site icon

Kishan Reddy: నగరంలో కొత్త టెండర్లు తీసుకునే పరిస్థితి లేదు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: నగరంలో కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వని కారణంగా కొత్త టెండర్లు తీసుకునే పరిస్థితి లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
నాంపల్లి నియోజకవర్గం మల్లేపల్లి డివిజన్‌లోని డి-క్లాస్‌లో కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన అనంతరం ఆసిఫ్‌నగర్ డివిజన్‌లోని దయాబాగ్‌లో G+01 కమ్యూనిటీ హాల్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామన్నారు. గత అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా, కార్పొరేటర్లుగా మజ్లిస్ పార్టీ నేతృత్వం వహిస్తుందన్నారు. మజ్లిసేతర ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కూడా ప్రజలకు అందకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండపడ్డారు. మజ్లిస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు పక్షపాతంతో వ్యవహరిస్తూ ఇక్కడి ప్రజలకు అన్యాయం చేస్తున్నారు.

Read also: Pawan Kalyan: మానవ జాతి మనుగడకు అటవీ సంరక్షణ అవసరం: డిప్యూటీ సీఎం పవన్

పార్లమెంటు సభ్యుడిగా బాధ్యతగా నాంపల్లి నియోజకవర్గ ప్రజలకు మేలు చేసేలా అనేక పనులు చేస్తున్నామన్నారు. నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంట్ల సాయంతో సుమారు రూ. 78 లక్షలతో కమ్యూనిటీ హాళ్లు, ఓపెన్ జిమ్స్, బోర్ వెల్స్.. ఇలా అనేక సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. బస్తీ నాయకులు, ప్రజలు రాజకీయాలకు అతీతంగా ముందుకురావాలన్నారు. హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంటుకు నిధుల కొరత వేధిస్తుందన్నారు. కనీసం వీధి లైట్లు హ్యాండిల్ చేసే సిబ్బందికి కూడా జీతాలివ్వడం లేదు. దీంతో సమ్మెకు దిగారన్నారు. హైదరాబాద్ నగరంలో కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వని కారణంగా కొత్త టెండర్లు తీసుకునే పరిస్థితి లేదన్నారు. నగరంలో అంబర్ పేట్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, నాంపల్లి, గోషామహల్ వంటి ప్రాంతాల్లోని బస్తీల్లో నిధుల కొరతతో ప్రజలకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్లకు నిధుల కొరతతో అరకొర సౌకర్యాలతో పాఠశాలలు నడుస్తున్నాయని తెలిపారు. నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలన్నారు.
kannappa : ప్రభాస్ ఫోటో లీక్ వీరుడు దొరికాడు.. మరి 5లక్షలు ఎవరికో..?