NTV Telugu Site icon

Kishan Reddy: ఒట్టేసి చెబుతున్నా.. తులసీ రాంనగర్ లో దుర్గంధం, వాసన రావడం లేదు..

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: ఒట్టేసి చెబుతున్నా.. తులసీ రాంనగర్ లో దుర్గంధం, వాసన రావడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మూసీ పక్కన ఇళ్లు కూల్చివేస్తారనే భయంతో ఒక్క తులసీ రాం నగర్ లో గుండెపోటుతో 9 నుంచి 10 మంది చనిపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నట్లు మూసీ ప్రాజెక్టు పూర్తి చేయాలని అనుకుంటే వేలాది ఇండ్లు కూల్చేయాల్సి వస్తుందన్నారు. కోటిమంది డ్రైనేజీ నీళ్లు.. మూసీలో వెళ్తుంది.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం ముందుగా చేయాల్సిన పని కాలుష్య జలాలు మూసీలో కలవకుండా చేయాలన్నారు. డ్రైనేజీ సంగతి తేల్చకుండా ఇల్లు కూల్చడం ద్వారా ప్రాజెక్టు ఎలా చేపడతారు ? అని ప్రశ్నించారు. మూసీ DPR ఎప్పుడు పూర్తి అవుతుంది? కృష్ణా నీళ్ళు తెస్తారా ? గోదావరి నీళ్ళు తెస్తారా ? అని మండిపడ్డారు. లక్షా యాభై వేల కోట్లు ఎక్కడ నుంచి తెస్తారు ? రేవంత్ పాలన ఏడాది పూర్తయ్యిందన్నారు. DPR రావడానికి రెండేళ్లు పడుతుందన్నారు.

Read also: Nara Rohit : ట్విట్టర్ లో నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్..

ఒట్టేసి చెబుతున్నా.. తులసీ రాం నగర్ లో దుర్గంధం వాసన రావడం లేదని తెలిపారు. పేదల నివాసం ఉంటున్న ఇళ్లపై రేవంత్ కన్ను పడింది.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని అనుకుంటున్నారని తెలిపారు. పేదల జోలికి వెళ్లకుండా పునర్జీవం చేయాలన్నారు. మూసీ ప్రక్షాళన అనే వార్త వింటేనే భయంతో వణికిపోతున్నారని తెలిపారు. కక్ష పూరితంగా వ్యవహరించవద్దన్నారు. హుస్సేన్ సాగర్ లో కొబ్బరినీళ్లు చేస్తా అన్న కేసీఆర్ ఫార్మ్ హౌస్ కి వెళ్ళాడని కీలక వ్యాక్యలు చేశారు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేయాలన్నారు. మహారాష్ట్రలో తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేసినట్లు పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. ఇల్లు కూల్చకుండా ప్రక్షాళన చేయాలని తెలిపారు. నల్లగొండ రైతులకు న్యాయం చేయాలని అన్నారు. నిజాం రిటైనింగ్ వాల్ కట్టినట్లు హై కోర్టు దగ్గర ఆనవాళ్లు ఉన్నాయన్నారు. రేవంత్ మళ్ళీ ముఖ్యమంత్రి కాలేడని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు సహకరిస్తే నే పూర్తికాలం సిఎం గా రేవంత్ పనిచేస్తారన్నారు. అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ తో నన్ను కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని అన్నారు.
Rammurthy Naidu: నారావారిపల్లెకు రామ్మూర్తి నాయుడి పార్థివదేహం.. నివాళులర్పించిన నేతలు!

Show comments