Kishan Reddy: చర్లపల్లి రైల్వే టెర్మినల్ 430 కోట్ల తో పూర్తయ్యిందని, యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉన్న పార్లమెంట్ సభ్యులతో సమావేశం జరిగిందని తెలిపారు. వారి వారి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను లేవనెత్తడం జరిగిందన్నారు. రైల్వే శాఖ నిర్మాణాత్మకమైన పనులు చేస్తోందని వారు చెప్పారన్నారు. సింగిల్ లైన్ ఉన్న చోట డబులింగ్ చెయ్యడం… ట్రిపులింగ్ చెయ్యడం చేస్తున్నారని తెలిపారు. ఎలెక్ట్రిఫికేషన్ చేసే పనిలో ఎస్ఆర్సీ మోడీ ఆలోచనలకు అనుగుణంగా పోతున్నామన్నారు. కొత్త రైల్వే స్టేషన్లు, రెన్నోవేషన్ పనులపై అందరూ సానుకూలంగా ఉన్నారని తెలిపారు. రైల్ మేనిఫాక్చరింగ్ యూనిట్ రాబోతుందన్నారు. వాగెన్స్, ఇంజిన్లు, LHB, TMU కొచ్ లను తయారు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఫైనల్ లోకేష్ సర్వే పై చాలా సీరియస్ గా వర్క్ జరుగుతోందన్నారు.
Read also: CM Revanth Reddy: ముఖ్యమంత్రి సహాయనిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.కోటి విరాళం..
50వేల కోట్ల రూపాయలతో ఈ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. 5 వందే భారత్ లు ఉన్నాయి.. రానున్న రోజుల్లో పెంచాలని కోరారని తెలిపారు. 40 రైల్వే స్టేషన్లు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ 430 కోట్ల తో పూర్తయ్యింది.. యాదాద్రి వరకు MMTS పొడిగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అందుకు సంబంధించిన పనులు ప్రారంభించాలన్నారు. గట్కేసర్ వరకు ఉంది.. రాయగిరి, యాదాద్రికి ఎక్సటెండ్ చెయ్యాలని తెలిపారు. 650 కోట్ల రూపాయల అదనపు భారం పడనుందన్నారు. 2/3 రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి… కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం.. స్వతహాగా ఈ పనులు పూర్తి చేయబోతోందన్నారు. వచ్చే రెండేళ్లలో ఈ రూట్ ఎంఎంటీఎస్ పనులు పూర్తి చేస్తామన్నారు. రైల్వే ట్రాఫిక్ పెరుగుతోంది..ఈ ఏడాది 6వేల కోట్ల బడ్జెట్ సాంక్షన్ అయ్యిందన్నారు. ఒన్ గోయింగ్ వర్క్ జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్నిటిలో సహకరించకపోయినా ఎంఎంటీఎస్ సెకండ్ ఫేస్ ప్రారంభించాలని అనుకున్నామని తెలిపారు.
Drug Soldiers: డ్రగ్స్ పై ప్రభుత్వం సరికొత్త యుద్ధం.. సోల్జర్స్‌గా ప్రభుత్వ ఉద్యోగులు..