NTV Telugu Site icon

Kishan Reddy: సంస్థాగత ఎన్నికలకు బీజేపీ సిద్ధం.. ఈ నెల 15 వరకు సభ్యత్వ సేకరణ..

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: సంస్థాగత ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సిద్ధం అవుతుంది.. ఈ నెల 15 వరకు సభ్యత్వ సేకరణ కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నేటితో మెంబర్ షిప్ డ్రైవ్ చివరి దశకు చేరుకుంది. సంస్థాగత ఎన్నికల నిర్వహణ పై బీజేపీ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ వర్క్ షాప్ కు కిషన్ రెడ్డి, లక్ష్మన్, డికే అరుణ, పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు,సభ్యత్వ ఇన్చార్జి లు , సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారులు హాజరయ్యారు. బూత్ , మండల, జిల్లా కమిటీ ల ఎన్నికలపై మార్గనిర్దేశం నిర్వహించేందుకు సిద్దమైంది బీజేపీ. బూత్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ పై చర్చ నిర్వహిస్తున్నారు ఈ నెల 15 నుండి 25 వరకు బూత్ కమిటీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర , జిల్లా రిటర్నింగ్ అధికారుల నియామకం జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణలో బీజేపీ సభ్యత్వం సుమారు 31 లక్షలు దాటిందని అంచనా వేస్తున్నారు.

Read also: MLA Madhavi Reddy Vs YSRCP: కడప మున్సిపల్ సమావేశం రసాభాస.. మాధవీరెడ్డి వర్సెస్‌ వైసీపీ

కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచం లోనే అతి పెద్ద పార్టీ బీజేపీ అన్నారు. రెగ్యులర్ గా సంస్థాగత ఎన్నికల నిర్వహించుకుంటున్న పార్టీ బీజేపీ అని తెలిపారు. తెలంగాణ లో సుమారు 35 లక్షలు చేరుకుందని అన్నారు. ఈ నెల 15 వరకు సభ్యత్వ సేకరణ కొనసాగుతుందన్నారు. వివిధ స్థాయిల్లో బీజేపీ కమిటీల్లో 30 శాతం కొత్త వారికి అవకాశం ఇచ్చారని తెలిపారు. బూత్ నుండి జాతీయ స్థాయి వరకు సమర్ధులైన వారితో కమిటీ వేసినట్లు వెల్లడించారు. బీజేపీ లో కొత్త వారిని చేర్పించాలని… భాగస్వామ్యులను చేయాలన్నారు. ఇతర పార్టీల్లో ఏమీ జరుగుతుంది తెలుసు… కుటుంబాల ఆధారంగా నడిచే పార్టీ లు అవి… ఆ పార్టీ లకి తరవాత ప్రెసిడెంట్ అవుతారో ముందే చెప్పొచ్చని తెలిపారు. బీజేపీ మాత్రం ప్రజాస్వామ్యంగా ముందుకు వెళ్తుంది… ఎవరైనా పార్టీ లో అధ్యక్షులు కావొచ్చన్నారు.

Read also: Seaplane: శ్రీశైలం టు విజయవాడ.. సీ ప్లేన్ ట్రయల్ రన్‌కు సర్వం సిద్ధం..

తెలంగాణ పరిస్థితి పెనం నుండి పొయ్యి లో పడ్డట్టు అయిందన్నారు. ఈ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ఏడాది అవుతుంది… ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదని మండిపడ్డారు. అప్పులు మాత్రం విపరీతంగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సంస్థాగతంగా బలోపేతం కావాలని పిలుపునిచ్చింది. ప్రజల పక్షాన పోరాటం చేయాలని కిషన్ రెడ్డి తెలిపారు. ఒక వైపు సంస్థాగత అంశాల పై దృష్టి పెడుతూనే.. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలన్నారు. ప్రజలకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలు కి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న రాష్ర్ట ప్రభుత్వం మిల్లర్లు, మధ్య దలారులతో కుమ్మక్కు అయ్యి రైతులకు నష్టం కలిగిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పనులు మాత్రం జరగడం లేదన్నారు. ఇక్కడ ఇచ్చిన హామీలు అమలు చేసినట్టు మహారాష్ట్రలో దుర్మార్గంగా అడ్వర్టైజ్ మెంట్ లు ఇచ్చుకుంటున్నారు
MLAs Fighting: కొట్టుకున్న ఎమ్మెల్యేలు.. జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో హై టెన్షన్

Show comments