NTV Telugu Site icon

Kishan reddy: ఆ రెండు పార్టీలు కవల పిల్లలు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy

Kishan Reddy

Kishan reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీ లు కవల పిల్లలు.. తో బొట్టువులని.. కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ లో చేరుతారు.. బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ లో చేరుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ ఘన విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్త కు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ నీ ఆదరించిన తెలంగాణ ప్రజానీకానికి వందనాలు అన్నారు. వందలాది మంది కార్యకర్తలు జైలు కు వెళ్ళారు… అక్రమ కేసులు పెట్టారు.. అయిన 10 సంవత్సరాలు కెసిఆర్ ప్రభుత్వం మీద పోరాటం చేశామన్నారు. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్ గిరి లో, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ స్థానం నుండి బీజేపీ గెలిచిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ,బీఆర్ఎస్ ఒకటే ననే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలు కానీ హామీలు ఇచ్చి మభ్య పెట్టిందన్నారు.

Read also: Harish Rao: మీరు పరిష్కరించాల్సిన సమస్యలు ఇవే.. సీఎం రేవంత్ కు హరీష్‌ రావు లేఖ..

పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అమిత్ షా వీడియో ను మార్ఫింగ్ చేసింది… రిజర్వేషన్ లు ఎత్తేస్తారని దుష్ప్రచారం చేసిందన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ విజయం సాధారణం కాదన్నారు. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదన్నారు. అసెంబ్లీ లుగా చూస్తే బీజేపీ 46 స్థానాల్లో మొదటి స్థానం వస్తె బీఆర్ఎస్ కేవలం 3 స్థానాల్లో మొదటి స్థానం వచ్చిందన్నారు. కాంగ్రెస్ అతి తక్కువ కాలం లోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. యే ఒక్క గ్యారంటీ నీ కూడా పూర్తిగా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం లో ఎక్కడ చూసినా ఆందోళనలు , నిరసనలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఫిరాయింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు.

Read also: MP Kesineni Chinni: 9 నెలల్లోనే అంతర్జాతీయ టెర్మినల్స్ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం..

రాజకీయ ఫిరాయింపులు, తెలంగాణ ను దోచుకొని డిల్లీకి పంపించడం ఈ రెండు పనులు మాత్రమే కాంగ్రెస్ చేస్తుందన్నారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టో లో పార్టీ మారితే అనర్హత వేటు వేస్తానని పాంచ్ న్యాయ పేరుతో పెట్టిందన్నారు. నిస్సిగ్గుగా, అనైతికంగా చట్ట వ్యతిరేకంగా ఫిరాయింపుకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని ప్రతి రోజూ రేవంత్ రెడ్డీ నడి రోడ్డు మీద ఆవహేళన చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. భవిష్యత్ లో ఆరెండు పార్టీలు కలుస్తాయన్నారు. పొత్తు, గీత్తు ఉంటే ఆ రెండు పార్టీ ల మధ్యనే అన్నారు. రెండు పార్టీ లు అవినీతి పార్టీ లే అన్నారు. బీజేపీ తెలంగాణ ప్రజలతో ఉంటుందన్నారు. ఈ రాష్ట్రం లో మార్పు రావాలి అంటే, తెలంగాణ అభివృద్ధి చెందాలి అంటే, అమర వీరుల ఆకాంక్షలు నెరవేరాలంటే బీజేపీ మాత్రమే అధికారంలోకి రావాలన్నారు. వందల వేల కోట్లు కాంగ్రెస్ డిల్లీకి పంపిస్తుందన్నారు.

Read also: Hyderabad Metro: ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో పనులకు శ్రీకారం..

ఏడు నెలలో ఒక్క బెల్ట్ షాప్ ను కూడా తొలగించలేదు రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. ఈ ప్రభుత్వం కి దిశ దశ లేదన్నారు. భూములు, మద్యం అమ్మడం, అప్పులు తేవడం అన్నారు. బీఆర్ఎస్, మజ్లిస్ తో కుమ్మక్కు అయినట్టే కాంగ్రెస్ మజ్లిస్ తో కుమ్మక్కు అయిందన్నారు. మజ్లిస్ కనుసన్నల్లో నే ఈ రెండు పార్టీ లు పని చేస్తాయన్నారు. తెలంగాణ ను వ్యతిరేకించిన మజ్లిస్ తో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు అంట కాగుతున్నాయన్నారు. బీజేపీ నీ విమర్శించే నైతిక హక్కు ఈ పార్టీలకి లేదన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే దానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ లే బాధ్యత వహించాలన్నారు. ఎంఐఎం సభ్యుడు పాలస్తీనా కి జై కొట్టారు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు సిగ్గుండాలన్నారు.
Today Gold Price: వరుసగా రెండోరోజు.. భారీ షాక్ ఇచ్చిన బంగారం ధరలు!