NTV Telugu Site icon

Kishan Reddy: మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు..

Kishan Reddy

Kishan Reddy

భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. మన్మోహన్‌ మృతి పట్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియజేశారు. నిరాడంబర జీవితం, దేశం పట్ల వారి అంకిత భావం, భావితరాలకు స్ఫూర్తి దాయకం అన్నారు.

Read also: CM Revanth Reddy : మన్మోహన్ సింగ్ సద్గుణం, నిష్కళంకమైన చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి

భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న డాక్టర్ మన్మోహన్ ఢిల్లీ ఏయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని తెలిసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా, ప్రణాళికా సంఘంలో కీలక బాధ్యతల్లో, యూజీసీ చైర్మన్ గా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా వారు దేశానికి వన్నె తీసుకొచ్చారు. పీవీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, దేశ ఆర్థిక మంత్రిగా.. దేశంలో సంస్కరణలు తీసుకురావడంలో మన్మోహన్ సింగ్ పోషించిన పాత్రను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు.

Read also: Manmohan Singh Passes Away Live Updates: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ కన్నుమూత.. పలువురు సంతాపం, లైవ్‌ అప్‌డేట్స్!

2019లో నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలో వారు అప్పుడప్పుడూ పార్లమెంటు వీల్ చైర్లో రావడం నాకు గుర్తుంది. పార్లమెంటు సభ్యుడిగా వారి అంకితభావానికి ఇది నిదర్శనం అన్నారు. మేధావి, మితభాషిగా, సౌమ్యుడు, స్థిత ప్రజ్ఞత కలిగిన నేతగా.. మన్మోహన్ సింగ్ మన యువతరానికి ఆదర్శమన్నారు. ఆ మహనీయుని ఆత్మకు శాంతి సద్గతులు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు కిషన్‌ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Manmohan Singh: శనివారం అధికార లాంఛనాలతో మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు..

Show comments