NTV Telugu Site icon

Khairatabad Ganesh: ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి లక్షల సంఖ్యలో భక్తులు..

Khairatabad Vinayaka

Khairatabad Vinayaka

Khairatabad Ganesh: ఖైరతాబాద్‌లోని బడా గణేష్ దర్మనం కోసం భక్తులు క్యూ కడుతున్నారు. ఆదివారం సెలవు దినంతో పాటు చివరి రోజు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. నాలుగు వైపుల నుండి లక్షల సంఖ్యలో భక్త జనం వస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ వినాయక నిమజ్జనం మంగళవారం అయినప్పటికీ, రేపు నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున భక్తులను దర్శనానికి అనుమతించలేదు. ఇవాళ (ఆదివారం) మాత్రమే దర్శనానికి అవకాశం ఉండడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఖైరతాబాద్ కు తరలివస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఖైరతాబాద్ భక్తులతో కిటకిటలాడింది. మరోవైపు ఖైరతాబాద్ గణేష్ సన్నిధిలో శ్రీనివాస కళ్యాణం వైభవంగా జరిగింది. బడా గణేష్ దర్మనానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Read also: Uttam Kumar Reddy: నాగార్జున సాగర్ ఎడమ కాలువ గండి ని వారం రోజుల్లో పూర్తి చేస్తాం..

ఖైరతాబాద్, లక్డీకపూల్, మెట్రో స్టేషన్లు జనంతో కిక్కిరిసిపోయాయి. ఖైరతాబాద్ రైల్వే ట్రాక్, ఐమాక్స్, లక్డీకపూల్ మార్గాల్లో గణేశుడిని దర్శించుకునేందుకు భక్తులు వస్తున్నారు. బడా గణపయ్య దర్శనానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దాదాపు క్యూలో దర్శనానికి 30 నిమిషాల నుంచి గంట సమయం పడుతుంది. సాయంత్రం వరకు మరింత పెరిగే అవకాశం ఉందిని అధికారులు తెలిపారు. ఇక సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ఖైరతాబాద్ బడా గణేష్ నమజ్జనం పూర్తవుతుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఉదయం 6.30 గంటలకు పూజలు ముగించుకుని నమజ్జనానికి తరలిస్తారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనాన్ని సకాలంలో పూర్తి చేయాలన్నారు.

Warangal Traffic: నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. వరంగల్ సీపీ కీలక సూచన..

Show comments