NTV Telugu Site icon

Khairatabad Ganesh: మొదలైన ఖైరతాబాద్ సప్తముఖ గణపతి శోభాయాత్ర..

Khairatabad Ganesh Shobha Yatra

Khairatabad Ganesh Shobha Yatra

Khairatabad Ganesh: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన శోభ మొదలైంది. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని శాఖల అధికారులు తమ పనిలో నిమగ్నమయ్యారు. రెండున్నర కిలోమీటర్ల మేర భారీ గణనాథుడి శోభాయాత్ర సాగనుంది. ఖైరతాబాద్, సెన్సేషనల్ థియేటర్, రాజ్ దూత హోటల్, టెలిఫోన్ భవన్.. తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్ వరకు శోభాయాత్ర కొనసాగనుంది. ఎన్టీఆర్ మార్గ్ 4వ నెంబర్ దగ్గర మహాగణపతి నిమజ్జన ఏర్పాట్లను చేపట్టారు. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం కోసం ప్రత్యేక సూపర్ క్రేన్ ను ఏర్పాటు చేశారు.

Read also: Khairatabad Ganesh: నేడు గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణేష్‌..

మధ్యాహ్నం 2 గంటలలోపు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్దం చేశారు. ఇక ముఖ్యంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర మార్గంలో 56 సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేశారు. సరికొత్త రికార్డ్ సృష్టించిన ఖైరతాబాద్ గణేశుడి ఆదాయం రూ. కోటి 10 లక్షలు.. హుండీ ద్వారా రూ. 70 లక్షల ఆదాయం ప్రకటనలు, హోర్డింగుల ద్వారా రూ. 40 లక్షల ఆదాయం.. 70 ఏళ్ల సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో.. 11 రోజుల పాటు ఖైరతాబాద్ గణేశుడు పూజలందుకున్నాడు.

Read also: kejriwal: నేడే కేజ్రీవాల్ రాజీనామా.. మరి కొత్త సీఎం ఎవరు..?

ఖైరతాబాద్ గణపతి శోభయాత్ర లైవ్ కోసం.. కిందనే ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయండి..

Israel Air Strike : గాజాపై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్.. నలుగురు పిల్లలతో సహా 16 మంది పాలస్తీనియన్లు మృతి