NTV Telugu Site icon

Thummala Nageswara Rao: రూ.2 లక్షలకు పైబడిన వాళ్ళ రుణమాఫీ పై త్వరలోనే ప్రకటన చేస్తాం..

Thummala Nageswara

Thummala Nageswara

Thummala Nageswara Rao: రూ.2లక్షలకు పైబడిన వాళ్ళ రుణమాఫీ పై త్వరలోనే ప్రకటన చేస్తామని వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. రైతు భరోసా సబ్ కమిటీ నివేదిక రాగానే రైతులకు అందజేస్తామన్నారు. ఈ ఏడాది వరి సాగులో తెలంగాణ టాప్ స్థానంలో నిలిచిందన్నారు. ఒక కోటిన్నర లక్షల ఎకరాల దిగుబడితో పంజాబ్ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టామన్నారు. గతంలో 41లక్షల ఎకరాలల్లో ఉన్న దొడ్డు ధాన్యం ఈ ఏడాది 21లక్షలకు పడిపోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సన్న ధాన్యం దిగుబడి పెరిగిందని, దేశ వ్యాప్తంగా సన్న ధాన్యానికి డిమాండ్ పెరిగిందన్నారు. 25 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో ఈ రోజు నాటికి 17 జిల్లాల్లో మాత్రమే జరిగాయన్నారు. 9.7 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్ళు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చేశారన్నారు. 6 వందల 25 కోట్లు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు డబ్బులు అందించామన్నారు. బీజేపీ – బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతుల మనోధైర్యం దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గతంతో పోల్చితే ఉత్పత్తి, కొనుగోళ్లు పెరిగాయన్నారు. అధికారం పోయినంత మాత్రాన ఇంతగనం ఆందోళన అవసరం లేదన్నారు. వాళ్ళ పార్టీలో ఆధిపత్యపోరు కోసం రైతులను ఇబ్బంది పెట్టకండి అని సూచించారు. రైతుల పై ఒత్తిడి లేదు.. ఓపెన్ మార్కెట్ లో అవకాశం ఉన్నా అమ్ముకోవచ్చన్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చే ప్రతీ గింజా మేము కొంటామన్నారు. కేంద్రం గైడ్లైన్స్ లో మార్పులు చేయాలని కోరుతున్నామని తెలిపారు.
Kishan Reddy: బుల్డోజర్ లతో ఎలా తొక్కిస్తారో చూస్తాం.. ఒక సీఎం ఇలానేనా మాట్లాడేది..