NTV Telugu Site icon

Telangana Assembly Session 2024: అసెంబ్లీ సమావేశాలకు గులాబీ బాస్ రాకపై నో క్లారిటీ..

Kcr Telangana Assembly 2024

Kcr Telangana Assembly 2024

Telangana Assembly Session 2024: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ హాజరుపై ఆ పార్టీ క్లారిటీ ఇవ్వలేదు. ఆదివారం ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో అసెంబ్లీ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అయితే అసెంబ్లీకి వచ్చే విషయాన్ని మాత్రం స్పష్టంగా ప్రకటించలేదు. మరోవైపు పార్టీ నేతలు కూడా సమయం వచ్చినప్పుడు కేసీఆర్ వస్తారని, రమ్మని ఎవరో వచ్చి అడిగితే రారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు కేసీఆర్ అవసరం లేదని, తాము సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రివర్గం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Read also: Telangana Assembly Sessions 2024: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..

కేసీఆర్ వస్తే సమావేశాలు హాట్‌ హాట్‌ గా సాగనున్నాయి. ప్రశ్నాలు సమాధానాలతో అసెంబ్లీ దద్దరిల్లాల్సిందే ఉంటున్నారు. అయితే మరికొంతమంది కేసీఆర్‌ వస్తే.. ఇరకాటంలో పడేసే కార్యక్రమాలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్‌లో మూడో అసెంబ్లీ తొలి సమావేశం జరిగింది. 6 రోజుల పాటు సభ జరిగినా కేసీఆర్‌ ఆపరేషన్ కారణంగా గైర్హాజరయ్యారు. ఆర్థిక పరిస్థితి, విద్యుత్ రంగంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన లేకపోయారు. ఈ ఏడాది జూలైలో బడ్జెట్‌ సమావేశాలు జరిగాయి. జులై 25న బడ్జెట్ సమర్పణకు హాజరైన ఆయన.. అనంతరం బడ్జెట్ పై మీడియాలో విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత మళ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలో కేటీఆర్, హరీష్‌రావులు ఇద్దరు నిలదీశారు.
Digital Exports: ఈ జాబితాలో చైనా, జర్మనీ, జపాన్‌ల కంటే భారత్‌ టాప్..