NTV Telugu Site icon

KBR Park: కేబీఆర్‌ పార్క్‌కు వెళ్లాలంటే నెలకు రూ.1000 కట్టాల్సిందే..

Kbr Park

Kbr Park

KBR Park: బంజారాహిల్స్‌లోని ప్రతిష్టాత్మకమైన కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ ఫారెస్ట్ (కేబీఆర్) ప్రవేశ టికెట్ ధర పెంచారు. ప్రతి సంవత్సరం కేబీఆర్‌ పార్క్ ప్రవేశ టికెట్ ధర పెంచుతుండటంతో ఈ ఏడాది కూడా అధికారులు పెంచారు. కేబీఆర్‌ పార్క్‌ కు వెళ్లే వాకర్లు, సందర్శకులు పార్క్‌ సందర్శించేందుకు ప్రస్తుతం పెద్దలు రూ.45, పిల్లలకు రూ.25 ప్రవేశ రుసుము చెల్లిస్తున్నారు. అదే వాకర్స్‌ అయితే నెల వారీపాస్‌ రూ.850 చెల్లిస్తున్నారు.

Read also: Daaku Maharaj : డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సర్ ప్రైజ్ గెస్ట్

అయితే ఇప్పుడు కేబీఆర్‌ పార్క్‌కు వెళ్లాలంటే పెద్దలకు రూ.50, పిల్లలు రూ.30 చెల్లించాల్సి ఉంటుంది. అదే వాకర్స్‌ అయితే నెల వారీ పాస్‌ రూ.1000 కట్టాల్సి ఉంటుంది. అంటే సందర్శకులకు రూ.5పెంచగా.. నెల వారీ పాస్‌కు రూ.150 రుసుమును పెంచారు అధికారులు. వీటిని వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులో వస్తాయని ప్రధాన గేటు వద్ద నోటీసులు అతికించారు. దీనిని సందర్శకులు, వాకర్స్‌లు గమనించాలని తెలిపారు. అయితే ఎంట్రీ ఫీజుపై వాకర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొంటున్నారు.

Read also: Allu Arjun : నేడు పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్

హైదరాబాద్ వాసులను నిత్యం ఇబ్బంది పెడుతున్న ట్రాఫిక్ సమస్యను తొలగించేందుకు జంక్షన్ల అభివృద్ధికి జీహెచ్ ఎంసీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా తొలి దశలో కేబీఆర్‌ పార్కు చుట్టూ ఉన్న 6 కూడళ్లను అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ ఫార్మేటివ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లో భాగంగా రూ.826 కోట్లతో జంక్షన్ల డిజైన్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2 ప్యాకేజీలుగా పనులు చేపట్టనున్నారు. సవ్యదిశలో అండర్‌పాస్‌లు, అపసవ్య దిశలో ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. మొదటి దశలో రూ.421 కోట్లతో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్‌లను అభివృద్ధి చేస్తారు. జీహెచ్‌ఎంసీ రెండో ప్యాకేజీలో రోడ్‌నంబర్‌ 45 జంక్షన్‌, ఫిల్మ్‌ నగర్‌, మహారాజా అగ్రసేన్‌, క్యాన్సర్‌ హాస్పిటల్‌ జంక్షన్లలో రూ. 405 కోట్లుగా ప్రగతి పనులు చేపట్టనున్నట్లు జీహెచ్‌ఎంసీ వెల్లడించింది.
Donald Trump: పనామా కాలువను స్వాధీనం చేసుకుంటాం.. గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తా!

Show comments