కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి వివాదం మలుపు తీసుకుని.. చిన్నారులను ఆమె అమ్ముకుంటుందనే ఆరోపణల వరకు వెళ్లింది. పిల్లలను దత్తత తీసుకోవడం.. ఆ తర్వాత అమ్ముకుంటుందనే ఆరోపణలు వచ్చాయి.. ఇక, మధ్యలో అదృశ్యమైన కరాటే కల్యాణి.. ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను ఎక్కడికీ పారిపోలేదు.. ఇక్కడే ఉన్నానని తెలిపారు. మరోవైపు, నేను పాపను దత్తత తీసుకోలేదని స్పష్టం చేశారు. పుట్టిన బిడ్డ వన్ ఇయర్ దాకా దత్తతకు అర్హులు కాదు.. నాకు చట్టాల మీద అవగాహన ఉందన్నారు. నేను ఎక్కడికి పారిపోలేదు, ఇష్టం వచ్చినట్టు కామెంట్ చెయ్యడం కరెక్ట్ కాదని కౌంటర్ ఇచ్చారు.
Read Also: LIVE : కరాటే కల్యాణి సంచలన వ్యాఖ్యలు..
నేను ఒక్క ఆడదాన్ని నన్ను డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఇబ్బందికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కరాటే కల్యాణి.. గతంలోనూ మైనర్ బాలిక అఘాయిత్యం పై పోస్ట్ లు పెట్టిన దానిపై కేసులు పెట్టారన్న ఆమె.. నా దగ్గర ఉన్న పాపా, తల్లిదండ్రులు నాతోనే ఉంటున్నారని తెలిపారు. దీని వెనకాల పెద్దల హస్తం ఉంది, శ్రీకాంత్ రెడ్డి ఒక బచ్చగాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మరోవైపు.. కరాటే కల్యాణి వద్దకు వచ్చిన చైల్డ్ లైన్, డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ సిబ్బంది… ఆమె దగ్గర వివరాలు సేకరించారు. రేపు సీడబ్ల్యూసీ కమిటీ ముందు పాపను హాజరుపరచాలని టీం మెంబెర్స్ చెప్పారు.. అధికారుల ముందు పాప తల్లిదండ్రులతో సహా వస్తానని చెప్పారు కల్యాణి.. దీంతో, అక్కడి నుంచి సిబ్బంది వెళ్లిపోయారు.
