Kaleshwaram Commission: రేపటి నుంచి ఇంజనీర్లను కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించనుంది. రేపటి నుంచి ఇంజనీర్లు, అకౌంట్స్ అధికారులను పిలువాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 40కి పైగా ఇంజనీర్లకు నోటీసులు ఇచ్చి విచారణకు కమిషన్ పిలువనుంది. రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించనుంది. రేపు కమిషన్ బహిరంగ విచారణకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుకు చెందిన 6గురు ఇంజనీర్లు హాజరు కానున్నారు. ఇంజనీర్ల విచారణ అనంతరం బ్యూరొకట్స్ ను విచారణ చేయనుంది. ENC లను ఈ వారంలోనే విచారణకు పిలువనుంది. ప్రభుత్వాన్ని సైతం అన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ప్లేస్మెంట్ రిజిస్టర్, మెజర్మెంట్ బుక్ ఇవ్వాలని ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు. CAG రిపోర్ట్ పై కాగ్ అధికారులను విచారణకు కమిషన్ పిలువనుంది. కమిషన్ కు అఫిడవిట్ అండ్ తప్పుడు సమాచారం ఇస్తున్న అధికారుల పై కమిషన్ చర్యలకు సిద్ధం అవుతుంది. డైరెక్టర్ గా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో భాగంగా క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కమిషన్ ఆలోచన చేస్తుంది. కమిషన్ ఇచ్చే పేర్లు ఉన్న అధికారులకు ప్రమోషన్ ఇవ్వకూడదని ప్రభుత్వానికి సిఫార్సు చేసే యోచనలో ఉందని సమాచారం. ఇక రేపటి నుంచి వచ్చే శనివారం వరకు కాళేశ్వరం కమిషన్ ఇంజనీర్లను ప్రశ్నించనుంది.
Gudem Mahipal Reddy: పటాన్ చెరువు డీఎస్పీ పై డీజీపీకి ఫిర్యాదు చేస్తా.. గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం..
Kaleshwaram Commission: రేపటి నుంచి ఇంజనీర్లను ప్రశ్నించనున్న కాళేశ్వరం కమిషన్..
- రేపటి నుంచి ఇంజనీర్లను కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించనుంది..
- ఇంజనీర్లు- అకౌంట్స్ అధికారులను పిలువాలని కమిషన్ నిర్ణయం..
Show comments