Jeevan Reddy: మల్లన్న సాగర్, మూసీ బాధితుల వద్దకు పోదాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి కి హరీష్ రావు సవాల్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హుస్సేన్ సాగర్ నీళ్లు కొబ్బరి నీళ్లు చేస్తా అన్నారు ఏమైంది? అంటూ మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మల్లన్న సాగర్ కి హరీష్ వెళ్తే అక్కడి జనమే అడ్డుకున్నారని గుర్తుచేశారు. మేము ఎప్పుడు అక్కడ ఉండే వాళ్ళమే అన్నారు. మూసి మీద మీకున్న అభ్యంతరం ఏంటి..? అని హరీష్ రావును ప్రశ్నించారు. ప్రభుత్వం కి సలహాలు సూచనలు ఇవ్వకుండా.. మురికి అలాగే ఉండాలి అంటారు ఏంటి..? అని మండిపడ్డారు. మూసి రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళను ఇప్పటికే తరలించారని తెలిపారు.
Read also: Minister Seethakka: అభివృద్ధి వికేంద్రీకరణ జరగకపోతే ప్రజల్లో వివక్షతా భావం పెరుగుతుంది..
బఫర్ జోన్ లో వారికి పునరావాస చర్యలు తీసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు. దాన్ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారని తెలిపారు. అడ్డుకోవాలని ఆలోచనే తప్పితే.. కేటీఆర్..హరీష్ కి సలహా ఇచ్చే ఆలోచన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుస్సేన్ సాగర్ నీళ్లు కొబ్బరి నీళ్లు చేస్తాన్నాడు.. ఏమైంది? అని హరీష్ కు ప్రశ్నించారు. పదేళ్లలో లక్ష ఉద్యోగాలు ఇవ్వలేదు బీఆర్ఎస్.. కానీ మేము పది నెల్లలో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గ్రూప్ 1 ఇప్పటికే ఓసారి వాయిదా వేశారు. కానీ బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ కి బెనిఫిట్ అవుతుందని వాయిదాల వేయాలని కోరుతున్నారన్నారు. బీజేపీ నేతలు కూడా సంకుచితంగా ఆలోచన చేయకండి అన్నారు. ప్రభుత్వం హుస్సేన్ సాగర్ నీ ప్రక్షాళన చేయాలని.. మూసి ప్రక్షాళన వెంటనే చేపట్టాలన్నారు.
Harish Rao: రేపు గన్ మెన్లు లేకుండా రా నేనే కారు నడుపుతా.. సీఎంకు హరీష్ రావు సవాల్..