Site icon NTV Telugu

Jagga Reddy: ఎంత ఎదిగినా ఎలా ఒదిగి ఉండాలో చాటి చెప్పిన మహనీయుడు మన్మోహన్ సింగ్

Jaggareddy

Jaggareddy

Jagga Reddy: ఎంత ఎదిగినా ఎలా ఒదిగి ఉండాలో తన చర్యల ద్వారా చాటి చెప్పిన మహనీయుడు మన్మోహన్ సింగ్ అని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల జగ్గారెడ్డి సంతాపం తెలియజేశారు. నిజాయితీకి, నిబద్ధతకు నిలువుటద్దం మన్మోహన్ సింగ్ అన్నారు.

Read also: Best Songs 2024: ఈ ఏడాది దుమ్ము దులిపిన సాంగ్స్‌ ఇవే..

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు తన మేధస్సును ధార పోసి దేశ ఆర్థిక అభ్యున్నతికి దారులు వేసిన దార్శనికుడు మన్మోహన్ సింగ్ అని తెలిపారు. ఎంత ఎదిగినా, ఎలా ఒదిగి ఉండాలో తన చర్యల ద్వారా చాటి చెప్పిన మహనీయుడన్నారు. దేశ రాజకీయాల్లో అజాత శత్రువుగా చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి అన్నారు. ఆయన మరణం దేశానికే తీరని లోటు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా అన్నారు.
KCR: మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు..

Exit mobile version